Breaking News

రజినీకాంత్ సలహా.. సింపుల్‌గా పక్కనపెట్టిన డైరెక్టర్..!

Published on Sun, 10/11/2026 - 10:49

ఇండియన్‌ చిత్రసీమలో నటి తమన్నాకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఆమె అందం, డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా కావాల్సిందే. ఆల్‌ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌తెచ్చుకుంది. అంతేకాకుండా ఆమెను రజనీకాంత్‌ సైతం మెచ్చుకున్నారు.  జైలర్‌ చిత్రంలో తమన్నా నటించిన  నువ్వు కావాలయ్యా అనే ఐటమ్‌ సాంగ్‌ ఆ చిత్రానికి పెద్ద బలంగా నిలిచింది. ప్రస్తుతం జైలర్‌ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన జైలర్‌ 2 చిత్రంతో రజినీకాంత్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ మూవీలో రమ్యకృష్ణ, ఎస్‌ జే.సూర్య, మిథున్‌ చక్రవర్తి, విద్యా బాలన్, యోగి బాబు, మిర్ణా ముఖ్య పాత్రలు పోషించారు. ఒక ప్రత్యేక పాటలో నటి పూర్ణ నటించారు. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. కాగా జైలర్‌ 2 చిత్రం ఈ నెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది.

ఈ సందర్భంగా రజినీకాంత్ ఆసక్తికర విషయాన్ని పంచుకన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రజినీకాంత్‌ ఈ మూవీలో తమన్నాను తీసుకుందామని దర్శకుడు నెల్సన్‌కు చెప్పానని తెలిపారు. దీనికి నెల్సన్.. మీకు నచ్చిందని నటి తమన్నాను ఈ చిత్రంలో తీసుకోవడం కుదరదు అని ఖరాఖండిగా చెప్పారన్నారు. అందుకు తనకు నచ్చిందని కాదు.. ప్రేక్షకులకు నచ్చుతారని చెప్పానని రజనీకాంత్‌ పేర్కొన్నారు. మొత్తం మీద తమన్నా కోసం రజనీకాంత్‌ చెసిన సిఫార్సును దర్శకుడు నెల్సన్‌ తిరస్కరించారన్నమాట. అలా తమన్నా నటించాల్సిన ప్రత్యేక పాటలో నటి పూర్ణ నటించారు. మరి ఆమె నటన జైలర్‌ –2 చిత్రానికి ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి.
 

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)