Breaking News

నా సినిమాల్లో విలువలు ఉండేలా చూసుకుంటాను: దర్శకుడు నక్కిన త్రినాథరావు

Published on Wed, 02/26/2025 - 00:13

‘‘నా సినిమాల్లో ఎంత ఫన్‌ ఉన్నా విలువలు ఉండేలానూ జాగ్రత్తలు తీసుకుంటాను. ‘సినిమా చూపిస్త మావ, నేను.. లోకల్, హలో గురూ  ప్రేమకోసమే, ధమాకా!’... ఇలా నా చిత్రాల్లో డైలాగ్స్‌ రూపంలోనో, సీన్స్‌ రూపంలోనో విలువలు ఉండేలా చూసుకుంటాను. ఇక ప్రతి మగాడికీ ఓ మహిళ తోడు ఎంత అవసరమో ‘మజాకా’లో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన(Nakkina Trinadha rao). సందీప్‌ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్‌పై రాజేశ్‌ దండా నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో నక్కిన త్రినాథరావు చెప్పిన విశేషాలు.

⇒ ఇద్దరు మగాళ్లు మాత్రమే ఉన్న ఆడ దిక్కులేని ఓ ఇంట్లో ఓ మహిళ పని చేసేందుకు భయపడుతుంటుంది. అందుకే ఆ తండ్రీకొడుకులు తమకో ఫ్యామిలీ కావాలనుకుంటారు. వాళ్లు పడే తపన, చేసే ప్రయత్నాల సమాహారమే ‘మాజాకా’ కథ. ఈ సినిమా వినోదాత్మకంగా సాగుతుంది. కానీ చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా ఉంటుంది. చిన్నప్పట్నుంచి అమ్మ ఎమోషన్‌ను అనుభూతి చెందని ఓ వ్యక్తి ఆ ఎమోషన్‌కు కనెక్ట్‌ అయితే ఎలా ఉంటుంది? ఈ తండ్రీకొడుకులు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను సినిమాలోనే చూడాలి. 

⇒ ప్రసన్నకుమార్‌ మంచి కథలు ఇస్తున్నారు. అందుకే ఆయనతో సినిమాలు చేస్తున్నాను. నా సొంత కథలతో చేయనని కాదు... నా సొంత కథలతో చేసిన సినిమాలూ ఉన్నాయి. ఇటీవల రైటర్‌ శ్రీనివాస్‌ ఓ కథ చెప్పాడు... నచ్చింది. ‘మజాకా’ రిలీజ్‌ తర్వాత ఆలోచిస్తాను.

⇒ నా ప్రొడక్షన్‌లోని ‘చౌర్యపాఠం’ సినిమాని  ఏప్రిల్‌ 18న రిలీజ్‌ చేయాలనుకుంటున్నాను. అలాగే ‘అనకాపల్లి’ అనే సెమీ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌ చేస్తున్నాను. ‘మజాకా’కు సీక్వెల్‌గా ‘డబుల్‌ మజాకా’ ఉంది. ‘ధమాకా’కు సీక్వెల్‌గా ‘డబుల్‌ ధమాకా’ అనుకుంటున్నాం. రవితేజగారితో చేస్తే బాగానే ఉంటుంది. మా ప్రయత్నం కూడా ఇదే... చూడాలి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)