Breaking News

తెలివైనవాళ్లు తెలివి తక్కువ పని చేస్తే..!

Published on Fri, 12/12/2025 - 04:02

నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రదర్శకుడు మురళీ మనోహర్‌ మాట్లాడుతూ– ‘‘శివ, నాయకుడు’ వంటి సినిమాలు చూసి, సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి కలిగింది. ఎమ్‌బీఏ పూర్తి చేసిన తర్వాత లండన్‌లోని ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. వార్నర్‌ బ్రదర్స్‌ సినిమాలకు టెక్నికల్‌ వర్క్‌ చేశాను.

ఆ తర్వాత ఇండియా వచ్చాను. 2010 నుంచి టాలీవుడ్‌లోనే ఉంటున్నాను. సంపత్‌ నందిగారి దగ్గర వర్క్‌ చేశాను. ‘సింబా’ చిత్రంతో ఆయన నన్ను డైరెక్టర్‌గా లాంచ్‌ చేశారు. నా దర్శకత్వంలోని తాజా సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. తెలివైనవాళ్ళు, తెలివి తక్కువవాళ్ల మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. తెలివైనవాడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువవాడు తెలివైన పని చేసినా... వారి జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయి? అన్నది ప్రధానాంశం. కథలో కొందరు తమ తెలివితక్కువ పనులతో ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ల ఇబ్బందులు మనకు నవ్వు పుట్టిస్తాయి.

సినిమాలో మంచి ఆర్గానిక్‌ కామెడీ ఉంది. నాకు రెగ్యులర్‌ సినిమాలు చేయడం ఇష్టం లేదు. నా తొలి సినిమా ‘సింబా’తో పోలిస్తే, ‘గుర్రం  పాపిరెడ్డి’ పూర్తిగా విభిన్నమైన చిత్రం. నరేష్‌ అగస్త్య నటించిన గత చిత్రాలు చూసి, ఈ సినిమాలోని గుర్రం పాపిరెడ్డి క్యారెక్టర్‌ కోసం అతన్ని తీసుకున్నాను. బ్రహ్మానందంగారు జడ్జ్‌ పాత్రలో కనిపిస్తారు. సినిమాలో ఆయనది ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ ఉంటుంది. యోగిబాబు వంటి ఇతర భాషల తారలు కూడా నటించారు. ఇక ఈ చిత్రనిర్మాతలతోనే ఓ హారర్‌ మూవీ కమిట్‌మెంట్‌ ఉంది. అలాగే ఓ మ్యూజికల్‌ రొమాంటిక్‌ మూవీ చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)