Breaking News

నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!

Published on Sun, 05/21/2023 - 04:18

‘‘మళ్ళీ పెళ్లి’లో లవ్, డ్రామాతోపాటు సెన్సేషనల్‌ అంశాలు ఉన్నాయి. నా కెరీర్‌లో ఈ మూవీకి బెస్ట్‌ స్క్రీన్‌ప్లే ఇచ్చాను’’ అని డైరెక్టర్‌ ఎంఎస్‌ రాజు అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై వీకే నరేశ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ – ‘‘విజయ నిర్మల, కృష్ణగారు నెలకొల్పిన బేనర్‌ విజయ కృష్ణ మూవీస్‌. నరేశ్‌గారి 50 ఏళ్ల కెరీర్‌ను బేస్‌ చేసుకుని మంచి సినిమా చేయాలని ‘మళ్ళీ పెళ్లి’ కథని నరేశ్, పవిత్రలకు చెప్పాను. వారికి బాగా నచ్చింది. ఈ స్టోరీని నేను రాశాను కాబట్టి ఇది నా కథా? లేక నరేశ్‌ కథా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ‘మళ్ళీ పెళ్లి’ కథ మొత్తం కల్పితం అని చెప్పలేను. నరేశ్, పవిత్ర గొప్ప నటులు. వారి నుంచి 50 శాతం పైగా నటన రాబట్టాను. వారి జీవితంలో జరిగిన కథే ఈ మూవీ అనుకోవచ్చు.



కాలాన్ని బట్టి పరిస్థితులు, ఆలోచనలు మారుతుంటాయి. ఒంటరితనం అనేది ఎలా ఉంటుంది? వంటి అంశాలను  ‘మళ్ళీ పెళ్లి’లో చూపించాం. ‘ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డర్టీ హరి’ వంటి సినిమాలు ట్రెండీగా తీసినవే. ‘డర్టీ హరి’ చేయమని ఓ యువ డైరెక్టర్‌ని అడిగితే.. ‘బోల్డ్‌ కంటెంట్‌.. చేయను’ అనడంతో నేనే దర్శకత్వం వహించాను. కొత్తదనంతో సినిమా తీయాలనే తపనతో నేను దర్శకునిగా మారాను.. లేదంటే ఇంట్లో కూర్చునేవాణ్ణి’’ అన్నారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)