Breaking News

‘త్రిబాణధారి బార్బరిక్‌’లో కొత్తదనం ఇదే : దర్శకుడు

Published on Sun, 08/24/2025 - 10:57

సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ .ఎన్‌ సింహా, ‘సత్యం’ రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్‌ నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వంలో దర్శక–నిర్మాత మారుతి సమర్పణలో అడిదెల విజయ్‌పాల్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో మోహన్‌ శ్రీవత్స మాట్లాడుతూ– ‘‘దర్శకుడిని అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇండస్ట్రీలో మనుగడ సాగించాలని సంగీతం నేర్చుకుని, ఎన్నో ఈవెంట్స్‌లో పాటలు పాడాను. ఇన్ని రోజులు నాకు సంగీతమే తిండి పెట్టింది.

దర్శకుడిగా ‘త్రిబాణధారి బార్బరిక్‌’ నా తొలి చిత్రం. నేను కథను అద్భుతంగా నరేట్‌ చేయగలను. అలా మారుతిగారికి చెబితే, ఆయన ఆశ్చర్యపోయారు. ఓ పాప చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. ఆగస్టు 15 సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఇంట్రవెల్, ఆగస్టు 15 తర్వాత పది రోజులకు జరిగే మరో కథతో సెకండాఫ్‌ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు మైథలాజికల్‌ టచ్‌ ఇచ్చాను.

 ఈ సినిమాలో విలన్‌ అంటూ ఎవరూ ఉండరు. అన్ని పాత్రల్లోనూ అంతర్గత యుద్ధం జరుగుతుంటుంది. ఈ సినిమా కొత్తదనం అదే. బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రాన్ని ఆపగలడు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్ధం జరిగేలా చేస్తాడు. నార్త్‌లో బార్బరికుడికి చాలా ఫాలోయింగ్‌ ఉంటుంది. ఆయనకు హైదరాబాద్‌లోనూ నాలుగు టెంపుల్స్‌ ఉన్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్‌గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. నా తర్వాతి చిత్రం మారుతిగారి బ్యానర్‌లోనే ఉండొచ్చు’’ అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)