Breaking News

మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?

Published on Mon, 08/14/2023 - 19:19

ప్రస్తుతం రెండే సినిమాల గురించి తెలుగు యువత తెగ మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకటి 'జైలర్'. మరొకటి 'భోళా శంకర్'. రజినీని ఓ రేంజులో లేపుతున్న మనోళ్లు.. చిరుకు ఘోరమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ మెహర్ రమేశ్‌పై తెగ విమర్శలు చేస్తున్నారు. ఫ్లాపుల దర్శకుడిగా ఇంతలా ట్రోలింగ్‌కి గురవుతున్న మెహర్‌లో ఓ నటుడు ఉన్నాడని, మహేశ్ సినిమాలో కామెడీ కూడా చేశాడని మీలో ఎవరికైనా తెలుసా?

(ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!)

అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. మెహర్ రమేశ్ పేరు చెప్పగానే 'శక్తి', 'కంత్రి', 'షాడో' ఇప్పుడు 'భోళా శంకర్' ఇలా అన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తాయి. అయితే దర్శకుడు కాకముందు అంటే 2002లో తొలుత ఇతడు నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవికి వరసకు తమ్ముడు అయ్యే మెహర్.. మహేశ్‌బాబు 'బాబీ' మూవీ సునీల్ అనే కామెడీ రోల్ చేశాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మెహర్ యాక్టింగ్ వదిలేశాడు.

తొలుత నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మెహర్.. తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. అయితే ఒకానొక సందర్భంలో అనుకోకుండా 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం వచ్చింది. అలా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అ తర్వాత 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు. ఇలా పరభాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం ఒక్కటంటే హిట్ కొట్టలేకపోయాడు. చేసిన ఐదు సినిమాలు బోల్తా కొట్టేశాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)