Breaking News

మణిరత్నం భారీ స్కెచ్‌.. మరో సూపర్‌ హిట్‌ ఖాయమేనా!

Published on Mon, 01/15/2024 - 07:07

మల్టీ స్టార్‌ చిత్రాలకు కేరాఫ్‌గా అడ్రస్ దర్శకుడు మణిరత్నం. అదేవిధంగా క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేయడంలో ఈయన దిట్ట. చాలాకాలం క్రితమే రజనీకాంత్‌, మమ్ముట్టి, అరవింద్‌స్వామి హీరోలుగా దళపతి చిత్రాన్ని తెరకెక్కించి సూపర్‌హిట్‌ కొట్టారు. అదేవిధంగా ఆ మధ్య శింబు, అరుణ్‌విజయ్‌, అరవిందస్వామి, ప్రకాష్‌రాజ్‌వంటి స్టార్‌ నటులతో సెక్క సివంద వానన్‌ చిత్రాన్ని రూపొందించి సక్సెస్‌ సాధించారు. ఇటీవల విక్రమ్‌, జయంరవి, కార్తీ, విక్రమ్‌ ప్రభు, శరత్‌కుమార్‌, ప్రకాష్‌రాజ్‌, ఐశ్వర్యారాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి వంటి నటీనటులతో రెండు భాగాలుగా తెరకెక్కించిన పొన్నియిన్‌సెల్వన్‌ చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి.

తాజాగా మణిరత్నం మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. మణిరత్నం, కమలహాసన్‌ కాంబినేషన్లో గత 37 ఏళ్ల క్రితం నాయకన్‌ చిత్రం రూపొందించి ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో థగ్స్‌ లైఫ్‌ అని భారీ గ్యాంగ్‌స్టర్స్‌ కథా చిత్రం రూపొందుతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రంలో జయంరవి, దుల్కర్‌ సల్మాన్‌, గౌతమ్‌ కార్తీక్‌ ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

ఇకపోతే నటి త్రిష ఇందులో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా నటి ఐశ్వర్యారాయ్‌ థగ్స్‌ లైఫ్‌లో నటించనున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. తాజాగా ఈ వరుసలో ప్రముఖ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మీ పేరు వచ్చి చేరింది. ఈ విషయాన్ని నిర్మాతల వర్గం ఇటీవల అధికారికంగా వెల్లడించింది. ఈ ముగ్గురు పొన్నియిన్‌సెల్వన్‌ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో ఇది మరో పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం కానుందా? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కమలహాసన్‌ గెటప్‌, విడుదల చేసిన టీజర్‌ థగ్స్‌ లైఫ్‌ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలను పెంచేస్తున్నాయి.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)