సఖి.. ఫస్ట్‌ ఆ హీరోహీరోయిన్లతో తీద్దామనుకున్నా: మణిరత్నం

Published on Tue, 01/28/2025 - 13:32

సఖి సినిమా (Sakhi Movie) అప్పట్లో సెన్సేషనల్‌ హిట్‌. పేరుకే డబ్బింగ్‌ మూవీ కానీ తెలుగులోనూ ఈ సినిమాను తెగ ఆరాధించారు. ఇంతకీ ఈ చిత్రం ఒరిజినల్‌ వర్షన్‌ ఏదో తెలుసా..? అలై పాయుతే (Alai Payuthey Movie). అలై పాయుతే అనే తమిళ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించాడు. ఆర్‌ మాధవన్‌, శాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించాడు. థియేటర్లలో వంద రోజులకు పైనే ఆడిన ఈ మూవీని తర్వాత హిందీలో సాతియా పేరిట రీమేక్‌ చేశారు. ఇంకేముంది అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌ అయింది.

మాధవన్‌కు బదులుగా..
తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. సఖి సినిమా కోసం మొదట బాలీవుడ్‌ హీరోహీరోయిన్లను అనుకున్నట్లు తెలిపాడు. మణిరత్నం మాట్లాడుతూ.. నేను ఫస్ట్‌ షారూఖ్‌, కాజోల్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను. షారూఖ్‌ దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. కానీ అప్పటికి క్లైమాక్స్‌ సరిగ్గా కుదర్లేదు. అందుకని దాన్ని పక్కనపెట్టేసి షారూఖ్‌తో దిల్‌సే సినిమా చేశాను. ఆ మూవీ అయిపోయేసమయానికి సఖి క్లైమాక్స్‌ను ఎలా తీర్చిదిద్దాలన్న ఆలోచన తట్టింది అని చెప్పుకొచ్చాడు. మణిరత్నం చివరగా పొన్నియన్‌ సెల్వన్‌ 2 తెరకెక్కించాడు.

చదవండి: సెట్‌లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్‌!

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)