పావు గంట కథ విని ఓకే చెప్పారు: మానస శర్మ

Published on Wed, 03/25/2026 - 03:11

‘‘రాకాస’ కథని నిహారికగారు ఓ పావు గంట వినగానే నమ్మకంతో వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమా ఔట్‌పుట్‌ కూడా ఆమెకు నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. డైరెక్టర్‌గా ‘రాకాస’ నా తొలి ఫీచర్‌ ఫిల్మ్‌. నాకు వెబ్‌ సిరీస్‌లు చేసిన అనుభవం ఉండటంతో ‘రాకాస’ తీయడం సవాల్‌గా అనిపించలేదు’’ అని డైరెక్టర్‌ మానస శర్మ పేర్కొన్నారు. సంగీత్‌ శోభన్, నయన్‌ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్‌ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్‌ కుమార్‌ బన్సల్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 3న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్రదర్శకురాలు మానస శర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్‌ హౌస్‌’ చేశాను. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా చేశాను. అనంతరం ‘బెంచ్‌ లైఫ్‌’ సిరీస్‌ చేశాను. ‘రాకాస’ని ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. సంగీత్‌ అద్భుతమైన నటుడు. అతని కామెడీ టైమింగ్‌ నాకు ఇష్టం.

నయన్‌ సారిక ప్రతిభ, నటన చూసి ఈ చిత్రంలోకి తీసుకున్నాం. థియేటర్లో చూసి, ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన చిత్రమిది. అనుదీప్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిహారికగారు మంచి నిర్మాత. ఇక నా తర్వాతి ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్‌ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా ఉండేలా చూసుకుంటాను’’ అని తెలిపారు.

Videos

లోకేష్ చేతుల కింద పవన్.. ఉస్తాద్ ఫ్యాన్స్ కు చెమటలు పట్టే వీడియో..

టాటా.. బైబై.. ఉస్తాద్ రొట్టె కొట్టుడు డైలాగ్స్

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

Photos

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)

+5

దురంధర్‌-2 మూవీ.. ఈ అరుదైన షూటింగ్ ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)