Breaking News

వారియర్‌ డైరెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

Published on Thu, 04/13/2023 - 17:49

ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి చెక్‌ బౌన్స్‌ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్‌ అనే సినిమా తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్‌ చంద్రబోస్‌ భావించారు. ఇందుకోసం పీవీపీ క్యాపిటల్‌ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు.

చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్‌ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్‌ బౌన్స్‌ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. గతేడాది ఆగస్టులో ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు సమయమిచ్చింది. దీంతో డైరెక్టర్‌ రూ.10 వేలు కోర్టుకు అపరాధ రుసుం చెల్లించి అనంతరం అప్పీల్‌ దాఖలు చేశాడు.

ఈ క్రమంలో తాజాగా బుధవారం (ఏప్రిల్‌ 12న) ఈ కేసును మరోసారి విచారించిన మద్రాస్‌ హైకోర్టు లింగుస్వామికి విధించిన ఆరు నెలల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో డైరెక్టర్‌ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్విటర్‌లో షేర్‌ చేసిన లింగుస్వామి మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు. కాగా లింగుస్వామి చివరిగా రామ్‌ పోతినేనితో వారియర్‌ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)