Breaking News

రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్

Published on Mon, 11/11/2024 - 17:30

తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈమెది హైదరాబాద్. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడట. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

2008లో వచ్చిన 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్.. వేదం, కొండపొలం, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలు తీశాడు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ హిట్స్ అయితే కొట్టలేకపోయాడు. మధ్యలో రమ్య అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయిపోయింది.

(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)

చాన్నాళ్ల క్రితం క్రిష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ ఇప్పుడు ప్రీతి చల్లాని పెళ్లి చేసుకోవడంతో వాటికి ఎండ్ కార్డ్ పడింది. అలానే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన క్రిష్‌కి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

పవన్‌తో 'హరిహర వీరమల్లు' సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయాలి. కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉండేసరికి తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)