Breaking News

పవన్ కల్యాణ్‌కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?

Published on Wed, 05/01/2024 - 12:48

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నాడు. గెలుస్తాడో లేదో పక్కనబెడితే ఇతడిని నమ్ముకున్న దర్శక నిర్మాతలు మాత్రం మెంటలెక్కిపోతున్నారు. అలాంటిది సడన్‌గా 'హరిహర వీరమల్లు' టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు వరస అప్డేట్స్ ఇస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి ఏమంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఈ సినిమా ఒకటి ఉందనే చాలామంది మర్చిపోయారు. ఇవన్నీ కాదన్నట్లు డైరెక్టర్ విషయంలో సరికొత్త రూమర్స్ వస్తున్నాయి.

(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)

2019 ఎన్నికల టైంలో పూర్తిగా సినిమాలే చేయనని చెప్పిన పవన్..  భీమవరం, గాజువాకలో పోటీ చేసిన చిత్తుగా ఓడిపోయాడు. దీంతో మాట మార్చేసి మళ్లీ మూవీస్ చేశాడు. అలా ఒప్పుకొన్న వాటిలో 'హరిహర వీరమల్లు' ఒకటి. మూడు నాలుగేళ్ల క్రితం సెట్స్‌పైకి వెళ్లిన ఈ పాన్ ఇండియా చిత్రానికి క్రిష్ దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. అయితే దీని తర్వాత ఒప్పుకొన్న వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజై పోయాయి గానీ 'హరిహర' మాత్రం మూలకి పడిపోయింది.

దీంతో అభిమానులతో సహా ప్రేక్షకులు 'హరిహర..' సినిమా ఉందనే విషయమే మర్చిపోయారు. ఇప్పుడు ఉన్నఫలంగా టీజర్ అని చెప్పి నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో నిర్మాత, నిర్మాణ సంస్థ పేర్లు మాత్రమే ఉన్నాయి. డైరెక్టర్ క్రిష్ పేరు ఎక్కడా లేదు. తాజాగా రిలీజ్ చేసిన మరో పోస్టర్‌లోనూ లేకపోవడం షాకిచ్చింది. అయితే ఆలస్యం అవుతుండటం వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడని, అతడి బదులు నిర్మాత కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం చేస్తారని అంటున్నారు. అయితే క్రిష్ కావాలనే తప్పుకొన్నాడా? లేదంటే తప్పించారా? అనే టాక్ నెటిజన్ల మధ్య నడుస్తోంది. మరి కారణం ఏమై ఉంటుందంటారు?

(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)