Breaking News

రవితేజ మార్క్‌ ఫన్‌ మిస్‌ కాకుండా...

Published on Sun, 12/21/2025 - 03:00

‘‘రవితేజగారితో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ చేయాలనే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ రాశాను. చక్కని వినోదంతోపాటు అద్భుతమైన సంగీతంతో మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా మన జీవితం తెరపై చూసుకున్నట్టుగా ఈ సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ కిశోర్‌ తిరుమల తెలిపారు. రవితేజ హీరోగా, ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ– ‘‘రవితేజగారి మార్క్‌ ఫన్‌ మిస్‌ అవ్వకుండా నా శైలిలో ఈ సినిమాని చాలా వినోదాత్మకంగా చేశాను. ఈ చిత్రంలో ఆయన పోషించిన రామ సత్యనారాయణపాత్ర ఫ్రెష్‌గా ఉంటుంది’’ అన్నారు. సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో ఉంటుంది.

ఈ సంక్రాంతికి మాతోపాటు వస్తున్న ఇతర చిత్రాలు కూడా బాగా ఆడాలి... కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి... అలాగే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని చె΄్పారు. ‘‘ఈ చిత్రంలో నాపాత్ర పేరు బాలామణి. ఇది నా ఫస్ట్‌ సంక్రాంతి సినిమా కాబట్టి చాలా ప్రత్యేకం’’ అన్నారు డింపుల్‌ హయతి. ‘‘ఈ మూవీలో మోడ్రన్, కాన్ఫిడెంట్, బోల్డ్‌గా ఉండే మానసా శెట్టిపాత్రలో కనిపిస్తాను’’ అని ఆషికా రంగనాథ్‌ పేర్కొన్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)