Breaking News

ఆ నమ్మకంతోనే ఉన్నాం: కౌశిక్‌ పెగల్లపాటి

Published on Tue, 09/09/2025 - 03:54

‘‘సాయి శ్రీనివాస్, అనుపమ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాక్షసుడు’(2019) సినిమా మంచి విజయం సాధించింది. వారి కలయికలో వస్తున్న రెండో చిత్రం ‘కిష్కింధపురి’పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. మా సినిమా ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూశాక ఆ అంచనాలను అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. ఒక సున్నితమైన కథతో, మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది’’ అని డైరెక్టర్‌ కౌశిక్‌ పెగల్లపాటి చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ జోడీగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’.

షైన్‌ స్క్రీన్స్  బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌశిక్‌ పెగల్లపాటి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆ తర్వాత కూడా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఓ సందర్భంలో నిర్మాత సాహుగారికి ‘కిష్కింధపురి’ కథ చెప్పాను.. ఆయనకి చాలా నచ్చింది. ఆ తర్వాత  శ్రీనివాస్‌గారు విని, బాగా ఎగై్జట్‌ అయ్యారు. ఈ సినిమా చేయడానికి అల్లు అరవింద్, బన్నీవాస్‌గార్లు కూడా ఒప్పుకున్నారు.

హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ‘కిష్కింధపురి’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ కథకి స్ఫూర్తి రామాయణం. 1989లో కథ మొదలవుతుంది. కథ, విజువల్, టెక్నికల్‌గా ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్  ఇవ్వాలని శ్రీనివాస్‌గారు నన్ను చాలా సపోర్ట్‌ చేశారు. ఇప్పటి వరకు చేయని పాత్రలో అనుపమ కనిపిస్తారు. సాహు గారపాటిగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.

చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. మా చిత్రంలో  స్మోకింగ్, డ్రింకింగ్‌ సన్నివేశాలు ఉండవు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. నా తొలి సినిమాకి ద్వితీయ చిత్రానికి ఎక్కువ గ్యాప్‌ వచ్చింది.. అయితే ఇకపై ఆ గ్యాప్‌ రాకూడదని కోరుకుంటున్నా. నా తర్వాతి సినిమాకి రెండు మూడు కథలు 
సిద్ధంగా ఉన్నాయి’’ అని చెప్పారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌