Breaking News

అలా చేయలేని రోజు సినిమాలు మానేస్తాను: కరుణ కుమార్‌

Published on Wed, 11/13/2024 - 00:44

‘‘సెట్‌లో కూడా స్టార్‌ హీరోలుగా ఉండే ఆర్టిస్టులను హ్యాండిల్‌ చేయడం నాకు కాస్త కష్టంగా ఉంటుంది. కానీ, తన స్టార్‌ హీరో ఇమేజ్‌ని బయటపెట్టి సెట్స్‌లో అందరితో హుందాగా ఉంటారు వరుణ్‌ తేజ్‌. ‘పలాస 1978’ సినిమాను ఎంత స్వేచ్ఛగా చేశానో, అంతే హాయిగా ‘మట్కా’ ని తీశాను. ఇరవై ఏళ్ల తర్వాత కూడా ‘మట్కా’లోని వరుణ్‌ నటన గురించి చెప్పుకుంటారు. వరుణ్‌ లుక్స్‌ విషయంలో చిరంజీవిగారి గెటప్స్‌ను రిఫరెన్స్ లుగా తీసుకున్నా’’ అని దర్శకుడు కరుణ కుమార్‌ అన్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘మట్కా’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు.

విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం రేపు(గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా కరుణ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన వాసు అనే వ్యక్తి కథే ఈ ‘మట్కా’. రతన్‌ ఖత్రి జీవితాన్ని ‘మట్కా’గా తీయలేదు. రతన్  ఖత్రీ ఏం చేసి ఉండేవాడోనని ఆలోచించి, ఓ ఐడియాతో ఈ స్క్రిప్ట్‌ని రాశాను. ‘మట్కా’ గేమ్‌ గురించి కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాం. మొబైల్‌ ఫోన్స్  లేని రోజుల్లో కూడా దేశం మొత్తం ఒక నంబర్‌ని ఓ వ్యక్తి అతి తక్కువ సమయంలో ఎలా పంపాడు? అనే పాయింట్‌ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

జీవీ ప్రకాష్‌కుమార్‌ మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. విజయేందర్‌ రెడ్డి, రజనీ చాలా సపోర్ట్‌ చేశారు. సినిమా అనేది కళతో కూడిన వ్యాపారమని నా అభి్రపాయం. నా నిర్మాతలు లాభపడాలనే కోరుకుంటాను. అందుకే ఎక్కవ ఫుటేజ్‌ని కూడా చిత్రీకరించను. నా ప్రతి సినిమాలో కూడా నా మార్క్‌ ఫిల్మ్‌మేకింగ్‌ సెన్సిబిలిటీస్‌ ఉంటాయి.. అలా చేయలేని రోజు సినిమాలు మానేస్తాను’’ అని తెలిపారు.  

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)