Breaking News

'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?

Published on Mon, 06/09/2025 - 17:17

 

'విరూపాక్ష' సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ దండు.. పెద్దగా హడావుడి లేకుండానే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆదివారం అమ్మాయి ఇంటి దగ్గర ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలోనే తోటి దర్శకులు కార్తీక్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తన ఎంగేజ్‌మెంట్ వీడియోని కార్తీక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరు? పెళ్లి ఎప్పుడు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)

దర్శకుడు సుకుమార్ శిష్యుల్లో ఒకడు కార్తీక్ వర్మ దండు. 'కార్తికేయ' సినిమాకు రైటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అలా 2015లో 'భమ్ భోలేనాథ్' మూవీతో డైరెక్టర్‪‌గా పరిచమయ్యాడు. కానీ ఆ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో మరో ప్రయత్నం చేయలేదు. చాన్నాళ్ల గ్యాప్ తీసుకుని మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో 'విరూపాక్ష' తీశాడు. ఇది సూపర్ హిట్ అయింది.

'విరూపాక్ష' హిట్ కావడంతో నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది. ఓవైపు దర్శకుడిగా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీ పర్సన్ అయ్యేందుకు కార్తీక్ వర్మ సిద్ధమైపోయాడు. ఈ క్రమంలోనే హర్షిత అనే అమ్మాయితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈమెది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదు. బంధువుల అమ్మాయిలా అనిపిస్తుంది. పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)