Breaking News

మూడు సార్లు సినిమా చూశారు.. మరో మూవీ చేస్తానని హామీ: డైరెక్టర్

Published on Sat, 06/07/2025 - 07:19

పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా చేశారు. దాదాపు ఐదేళ్ల పాటు చాలా ఇబ్బందులు పడిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. సోషల్ మీడియాలో మాత్రం వేరే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాకు బయ్యర్లు దొరకట్లేదని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు పక్కనబెడితే మూవీని అధికారికంగా వాయిదా వేసినా సరే ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు. తాజాగా మచిలీపట్నంలో ఈవెంట్ నిర్వహించారు.

మచిలీపట్నం బీచ్ ఒ‍డ్డున 'హరిహర..' ఈవెంట్ శుక్రవారం సాయంత్రం జరిగింది. దీనికి హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ హాజరయ్యారు. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతికృష్ణ ఏమన్నారంటే.. 'పవన్ కల్యాణ్.. ఒక్కసారి కాదు ఈ సినిమాని మూడు సార్లు చూశారు. గంటపాటు నన్ను మెచ్చుకున్నారు. మళ్లీ ఇంకో సినిమా చేస్తానని మాటిచ్చారు. అసురన్ అనే పాటని అయితే ఏకంగా 500 సార్లు విన్నారు' అని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు)

సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మాట్లాడటం బాగానే ఉంది. కాకపోతే రియాలిటీలో చూసుకుంటే 'హరిహర వీరమల్లు' సినిమాకు మార్కెట్‌లో పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో రావాల్సిన ఈ మూవీ.. దాదాపు 11-12 సార్లు వాయిదా పడింది. దీంతో పవన్ అభిమానులే ఈ చిత్రం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదనిపిస్తుంది. అలాంటిది పవన్.. తన సినిమాని మూడుసార్లు చూడటం, మరో మూవీ చేస్తానని దర్శకుడికి మాటివ్వడం అంటే నెటిజన్లు సందేహపడుతున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి?

డైరెక్టర్ జ్యోతికృష్ణ విషయానికొస్తే.. నిర్మాత ఏఎం రత్నం కొడుకు. చాన్నాళ్లుగా డైరెక్షన్ చేస్తున్నాడు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత కేడీ, ఊ ల లా లా అనే తమిళ చిత్రాలు చేశారు. తెలుగులో గోపీచంద్‌తో 'ఆక్సిజన్', కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ రంజన్' తీశారు. ఇవన్నీ థియేటర్ దగ్గర ఆడలేదు. ఇప్పుడు కూడా క్రిష్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. మరి 'హరిహర..'తోనైనా హిట్ కొడతారేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)