Breaking News

మూడుభాషల్లో ఒకేసారి దృశ్యం 3

Published on Tue, 06/24/2025 - 00:02

‘దృశ్యం’ సినిమాలకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సిరీస్‌లో రానున్న మూడో చిత్రం ‘దృశ్యం 3’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. మోహన్ లాల్‌ హీరోగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వెంకటేశ్‌ హీరోగా శ్రీప్రియ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’, వెంకటేశ్‌–జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘దృశ్యం 2’ హిట్‌గా నిలిచాయి.

ఇక హిందీలో అజయ్‌ దేవగణ్‌ హీరోగా డైరెక్టర్‌ నిషికాంత్‌ కామత్‌ తెరకెక్కించిన ‘దృశ్యం’, అజయ్‌ దేవగణ్‌– డైరెక్టర్‌ అభిషేక్‌ పాఠక్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం 2’ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ సిరీస్‌లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్‌లాల్‌ నటించనుండగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రీప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇదిలా ఉంటే... జీతూ జోసెఫ్‌ కథతో సంబంధం లేకుండా హిందీలో ‘దృశ్యం 3’ ఉంటుందని అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా జీతూ జోసెఫ్‌ మాట్లాడుతూ–‘‘మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు, హిందీ భాషల్లోనూ ‘దృశ్యం 3’ సినిమా వస్తుంది. స్క్రిప్ట్‌ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీమ్‌కు ఇస్తాను. అక్కడి సంస్కృతి, నేటివిటీకి తగ్గట్టు వాళ్లు కథలో మార్పులు చేసుకుంటారు.

మూడు భాషల్లో ఒకేసారి ‘దృశ్యం 3’ని చిత్రీకరించడం సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచన ఉంది’’ అని స్పష్టం చేశారాయన. ‘దృశ్యం 3’ తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్‌ దేవగణ్‌ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు. అయితే దర్శకులు ఎవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)