Breaking News

49 ఏళ్లయినా సింగిల్‌గానే.. కారణమేంటో చెప్పిన నటుడు

Published on Mon, 10/09/2023 - 16:36

హర్షవర్దన్‌.. డైరెక్టర్‌గా కంటే కూడా అమృతం సీరియల్‌ నటుడిగా ఎక్కువమందికి సుపరిచితం. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా ఎన్నో చిత్రాల్లో నటించాడు. గుండెజారి గల్లంతయ్యిందే, మనం, గురు వంటి సినిమాలకు డైలాగులు రాశాడు. ఇటీవల రిలీజైన మామా మశ్చీంద్ర సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఇది బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది.

ఇకపోతే 49 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటున్నాడు హర్ష వర్ధన్‌. తను ఒంటరిగా ఉండటానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'నా లైఫ్‌ స్టైల్‌కు పెళ్లి అనేది పడదు. నేను అందరితోనూ స్నేహంగా ఉంటాను. ఉన్న కాసేపు చాలా బాగా మాట్లాడతాను. అలా అని పార్టీలకు గట్రా వెళ్లను. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాను. వేరేవాళ్లకు ఎక్కువ సమయం ఇవ్వడం, వాళ్లకు నచ్చినట్లుగా ఉండటం అనేది కష్టం. నేనసలు నా కుటుంబ బాధ్యతలనే సరిగా పట్టించుకోను.

నేను పెళ్లి చేసుకుంటే భార్యను వదలను, వేరే అమ్మాయిని కన్నెత్తి చూడను, పిల్లలను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. వాళ్లు చనిపోయేవరకు నేను బతికుండాలి.. ఎందుకంటే వారికోసం కష్టపడాలి, వాళ్లకు రక్షణ కవచంగా ఉండాలి! అని ఆరాటపడతాను. అయినా పెళ్లి అనేది తోడు కోసం అంటారు. కానీ, అది ఒక ఇన్సూరెన్స్‌ పాలసీ, బిజినెస్‌ డీల్‌. మనకు చేతకానప్పుడు భార్యాపిల్లలు చూసుకుంటారు. మన పనులన్నీ చేసిపెడతారంతే!

నాకు కూడా గతంలో రిలేషన్స్‌ ఉన్నాయి. పెళ్లి కోసం అమ్మాయిల వెంటపడ్డాను కూడా! ఒకమ్మాయైతే బ్రేకప్‌ అయ్యాక కూడా అప్పుడప్పుడూ మెసేజ్‌లు చేస్తూ ఉంటుంది. నా మంచి చెడూ చూసేందుకు నాకు ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఇక జీవితమంతా ఆడుతూ పాడుతూ సింగిల్‌గా బతికేస్తాను' అని చెప్పుకొచ్చాడు హర్ష వర్ధన్‌.

చదవండి: బిగ్‌బాస్‌ 7 మినీ లాంచ్‌లో నాగ్‌ వేసుకున్న షర్ట్‌ ధరెంతో తెలుసా?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)