Breaking News

కథ నచ్చితే ఆ తేడా చూడను: హరీష్‌ శంకర్‌

Published on Thu, 04/24/2025 - 05:36

‘‘నాకు సినిమా కథ నచ్చితే భాష, చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా చూడకుండా ప్రమోట్‌ చేయడానికి ముందుంటాను. ‘జింఖానా’ చిత్రం ట్రైలర్‌ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని అందరూ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు’’ అని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ చెప్పారు.

 నస్లెన్, లుక్మాన్‌ అవరన్, గణపతి, సందీప్‌ ప్రదీప్‌ ముఖ్య తారలుగా ఖలీద్‌ రెహమాన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘అలప్పుజ జింఖానా’. ఖలీద్‌ రెహమాన్, జోబిన్‌ జార్జ్, సమీర్‌ కారత్, సుబీష్‌ కన్నంచెరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న మలయాళంలో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌పై సుబ్బారెడ్డి తెలుగులో ‘జింఖానా’ పేరుతో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ–‘‘జింఖానా’ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్న సుబ్బారెడ్డిగారికి అభినందనలు. నైజాంలో మైత్రీ మూవీస్‌ శశిగారు రిలీజ్‌ చేస్తున్నారు కాబట్టి తిరుగుండదు’’ అన్నారు. 
డైరెక్టర్‌ అనుదీప్‌ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నేను చూశాను.. చాలా బాగుంది. స్పోర్ట్స్‌ కామెడీ నేపథ్యంలో చాలా బాగా తీశారు’’ అని చెప్పారు. ‘‘స్పోర్ట్స్‌ కామెడీ ఫిల్మ్‌ 

‘జింఖానా’. చాలా మంచి యాక్షన్‌ సీక్వెన్ ్సలు, పాటలుంటాయి’’ అని ఖలీద్‌ రెహమాన్‌ తెలిపారు. హీరో నస్లెన్‌ మాట్లాడుతూ–
‘‘నేను నటించిన ‘ప్రేమలు’ సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన స΄ోర్ట్‌ మర్చి΄ోలేను. ‘జింఖానా’ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ఈ వేడుకలో మైత్రీ మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి, డైరెక్టర్స్‌ సాగర్‌ కె. చంద్ర, సుజీత్, సందీప్, నటీనటులు బేబీ జీన్, లుక్మాన్‌ అవరన్, సందీప్‌ ప్రదీప్‌ మాట్లాడారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)