Breaking News

ఆ దర్శకులపై లేని అటాక్ నా ఒక్కడి మీదే ఎందుకు?: హరీశ్ శంకర్

Published on Mon, 08/19/2024 - 13:29

ఆగస్టు 15 వీకెండ్‌లో రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. మరీ ముఖ్యంగా దర్శకుడు హరీశ్ శంకర్‍‌పై ఘోరమైన విమర్శలు వస్తున్నాయి. రిలీజ్‌కి ముందు మాట్లాడిన దానికి.. మూవీలో కంటెంట్‌కి ఏ మాత్రం సంబంధం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్ మీట్ పెట్టిన హరీశ్ శంకర్.. తనపై ట్రోల్స్ గురించి స్పందించాడు.

(ఇదీ చదవండి: సూర్య vs రజినీకాంత్.. కలెక్షన్స్ దెబ్బ తీసే పోటీ!)

రవితేజ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల దర్శకులపై లేని అటాక్ తనపైనే జరుగుతోందని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు. కావాలనే టార్గెట్ చేసి మరీ తనని విమర్శిస్తున్నారని అన్నాడు. 'ఇంతకు ముందొచ్చిన రామారావ్ ఆన్ డ్యూటీ, రావణాసుర, ఖిలాడి, ఈగల్ సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాయి. కానీ ఆ డైరెక్టర్స్ మీద లేని అటాక్ నా ఒక్కడి మీదే ఉంది. ఎందుకంటే వ్యక్తిగత అజెండాతో నన్ను టార్గెట్ చేశారని నాకు అనిపిస్తోంది' అని హరీశ్ శంకర్ అన్నాడు.

అయితే హరీశ్ శంకర్ తాజా కామెంట్స్‌పై కూడా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. మిగతా దర్శకులు ఇలా రిలీజ్‌కి ఇంటర్వ్యూల్లో మాట్లాడలేదని, వాళ్లెవరు రీమేక్స్ చేయలేదని తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా హరీశ్ శంకర్.. తాను తీసిన సినిమా కంటే చేస్తున్న వ‍్యాఖ్యల వల్లే వైరల్ అవుతుండటం ఇక్కడ విచిత్రమైన విషయం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)