Breaking News

రత్నం కథ ఇదే.. అందరికి నచ్చే హీరో ఎవరంటే: హరి

Published on Fri, 04/26/2024 - 13:24

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ నటించిన రత్నం చిత్రం ఏప్రిల్‌ 26న తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరపైకి రానుంది. దీంతో చిత్ర యూనిట్‌ ప్రచారంలో ముమ్మరంగా మునిగిపోయింది. కమర్శియల్‌ దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి దర్శకత్వం వహించిన చిత్రం రత్నం. ఈయన నటుడు విశాల్‌తో భరణి,పూజా చిత్రాలతో హిట్‌ కొట్టారు. ఇప్పుడు మూడో చిత్రంగా రత్నం వస్తుంది. కాగా దర్శకుడు హరి ఇటీవల పుదుచ్చేరిలో విశాల్‌ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నం చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

రోడ్డులో వెళుతున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరూ సాయపడటానికి ముందుకు రావడం లేదని,  వేడుకగా చూస్తున్నారని, అలా సాయం చేసే ఒక యువకుడి ఇతి వృత్తమే రత్నం చిత్రం కథ అని చెప్పారు. ఇకపోతే నటుడు విజయ్, త్రిష జంటగా నటించిన గిల్లీ తెలుగులో (ఒక్కడు) చిత్రం ఇటీవల రీ-రిలీజ్‌ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తోందన్నారు. మంచి చిత్రాలు ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అన్నారు.

ఇలాంటి చిత్రాలను చూస్తున్నప్పుడు మంచి చిత్రాలు చేయాలని దర్శకులకు ఉద్వేగం కలుగుతుందన్నారు. సాధారణంగా నటులకు ఒక వర్గం అభిమానులే ఉంటారని, అయితే రజకాంత్‌ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమాన నటుడని పేర్కొన్నారు. తలైవన్‌ చిత్రం వస్తుందంటే తొలిరోజునే చూస్తానని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఏ దర్శకుడు జాతి గురించో, మతం గురించో చిత్రం చేయాలని భావించరని దేశంలో జరుగుతున్న జాతి, మతం ఆలోచనలనే సినిమాగా తీస్తారని చెప్పారు. సినిమా అనేది జాతి, మతం, భాషలకు అతీతం అని దర్శకుడు హరి పేర్కొన్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)