Breaking News

టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్

Published on Sun, 12/21/2025 - 14:38

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది టికెట్ల రేట్ల అంశమే. పెద్ద సినిమాలు రిలీజైన ప్రతిసారి దీని గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా 'అఖండ 2' వచ్చినప్పుడు కూడా రేట్ల పెంపుపై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరే ఈ విషయం వదిలిస్తే ఇప్పుడు టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి.. ఇదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంటున్నారని చెప్పుకొచ్చారు.

'ఓటీటీల రాకతో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన కంటెంట్ వాటిలో దొరుకుతోంది. డబ్బున్నవాడు ఓటీటీలో మూవీస్ చూస్తుంటే.. డబ్బులేనివాడు టీవీలో చూస్తున్నాడు. ఒకప్పుడు సినిమా అనేది ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ సాధనం. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. అందులోనూ సినిమా.. చాలా ఖరీదైన ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డి గారు అప్పట్లో టికెట్ రేట్లు తగ్గిస్తే వీళ్లందరూ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాస్తవానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు.. ఆ రేట్లే బెటర్ సర్, కనీసం జనాలు థియేటర్లకు వచ్చేవారు అని నాతో అన్నారు'

'ఈ రోజుల్లో సరసమైన ధరలకు తక్కువ రేట్లకు సినిమా చూపిస్తామని చెప్పుకోవడం పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. ఇంకొన్నాళ్లకు 1+1 ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని.. జంటగా వచ్చి సినిమా చూడొచ్చని, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమా చూడొచ్చని బోర్డులు పెట్టినా పెట్టొచ్చు. మనం చెప్పలేం. అలాంటి పరిస్థితి వచ్చేసింది' అని బీవీఎస్ రవి తన అభిప్రాయాన్ని చెప్పారు.

ఈయన చెప్పినది చూస్తే జరుగుతున్నది, జరగబోయేది ఇదే కదా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో రిలీజైన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు రూ.99 టికెట్ అనే ప్రచారం చాలా ప్లస్ అయింది. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకనిర్మాతలు టికెట్ రేట్ల విషయంలో పునారాలోచన చేసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రేక్షకుడు.. థియేటర్‌కి పూర్తిగా దూరమయ్యే అవకాశముంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)