Breaking News

చిరంజీవి, బాలకృష్ణ..ఇద్దరు పని రాక్షసులే: బాబీ

Published on Sat, 01/11/2025 - 14:31

‘నేను చిరంజీవి(వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ ఇద్దరితో కలిని పని చేశాను. ఇద్దరిలో ఎంతో ‍క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పని రాక్షసులే. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంటారు. నిర్మాలతకు అసలు నష్టం రానివ్వకూడదనే ఉద్దేశంతో పని చేస్తుంటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌ లాంటి సీనియర్‌ హీరోలతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు యంగ్‌ డైరెక్టర్‌  బాబీ కొల్లి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్‌’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటింరు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు(జనవరి 12) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్‌ బాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

→ బాలకృష్ణ గారి ఇమేజ్ ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని 'డాకు మహారాజ్' (Daaku Maharaaj )సినిమా చేయడం జరిగింది. అయితే బాలకృష్ణ గారి గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాము. బాలయ్య గారు సెటిల్డ్ గా డైలాగ్ లు చెప్తే చాలా బాగుంటుంది. 'నరసింహానాయుడు', 'సమరసింహారెడ్డి' తర్వాత 'సింహా' ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. డాకు మహారాజ్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. చాలా నిజాయితీగా కథను చెప్పాము.

→ హీరోకి ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ(Nandamuri Balakrishna) గారి సినిమాల్లో గొడ్డలి వంటి పవర్ ఫుల్ ఆయుధం బాగా ఫేమస్. ఈ సినిమాలో ఆలాంటి శక్తివంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు.

→ నా గత సినిమాలతో బాబీ కథాకథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. ఇప్పుడు 'డాకు మహారాజ్'తో విజువల్స్ పరంగా గొప్ప పేరు వస్తుంది.

→ ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు హీరోయిన్లు మంచి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. వారివి రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

→ రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా బాబీ డియోల్ గారి పాత్ర కొత్తగా ఉంటుంది. ఆయన నిబద్ధతగల నటుడు. పాత్రకి న్యాయం చేయడం కోసం సెట్ లో ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారు. అలాగే బాబీ డియోల్ గారు ఎన్టీఆర్ గారిని, బాలకృష్ణ గారిని ఎంతో గౌరవిస్తారు.

→ నిర్మాత నాగవంశీ, బాలకృష్ణ గారిని ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్ లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలి అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాము. డీఓపీ విజయ్ కన్నన్ తో నాకు ముందే పరిచయముంది. అప్పుడు ఆయన జైలర్ సినిమాకి పని చేస్తున్నారు. నాగవంశీ గారు కూడా విజయ్ పేరు చెబితే వెంటనే ఓకే అని, ఆయనతో మాట్లాడారు. అలా విజయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేస్తారు. కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి.

→ బాలకృష్ణ గారి నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గారు గౌరవిస్తారు. అభిమానులు తనను చూడటానికి వస్తారు కదా అని, డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)