Breaking News

మహేశ్‌బాబుకి ట్రైలర్‌ బాగా నచ్చింది: అర్జున్‌ జంధ్యాల

Published on Sun, 11/17/2024 - 00:06

‘‘దేవకి నందన వాసుదేవ’ సినిమా మంచి భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ధర్మం అంటే దేవుడు అనే మాట కూడా ఈ మూవీలో చాలా కీలకం. అలాగే పూర్తి వాణిజ్య అంశాలు ఉంటాయి. మా చిత్రం కుటుంబ ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చుతుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ అర్జున్‌ జంధ్యాల తెలిపారు. అశోక్‌ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.

ఈ సందర్భంగా అర్జున్‌ జంధ్యాల విలేకరులతో మాట్లాడుతూ– ‘‘గుణ 369’ డైరక్టర్‌ ప్రశాంత్‌ వర్మగారికి నచ్చింది. ఆయన రాసిన ‘దేవకి నందన వాసుదేవ’ కథకు నేనైతే న్యాయం చేయగలనని భావించి, దర్శకత్వ బాధ్యతలను నాకు అప్పగించారు. ఫైనల్‌ సినిమా చూసి సర్‌ప్రైజ్‌ అయ్యారాయన. అశోక్‌ గల్లాగారు తన పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. మానసది బలమైన పాత్ర. దేవ్‌ దత్తాగారు కంసరాజ్‌ పాత్రని అద్భుతంగా చేశారు.

సాయి మాధవ్‌ బుర్రాగారు సినిమాలోని భావోద్వేగాలు, కథకి తగ్గట్టుగా మాటలందించారు. నేపథ్య సంగీతం, మ్యూజిక్‌తో ఈ సినిమాకిప్రాణం పోశారు భీమ్స్‌. బాలకృష్ణగారు ఈ కథకి కావల్సినవన్నీ సమకూర్చి గ్రాండ్‌గా నిర్మించారు. హీరో మహేశ్‌బాబుగారికి మా సినిమా ట్రైలర్‌ బాగా నచ్చింది. ఆయన మా టీమ్‌ని అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు’’ అని తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)