Breaking News

స్క్రీన్‌ప్లేకి అవార్డు రావడం హ్యాపీగా ఉంది: దర్శకుడు అనిల్‌ రావిపూడి

Published on Mon, 03/09/2026 - 00:31

‘‘ప్రతి సినిమాకి ఆడియన్స్‌ ఇస్తున్న సక్సెస్‌తో ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. అయితే ప్రతి సినిమాకు భయం కూడా కచ్చితంగా ఉంటుంది. లేకపోతే ప్రతి సినిమాకి అంత నిజాయితీతో పని చేయలేం. ఆడియన్స్‌ ఇచ్చే ఎనర్జీనే ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే ఈ (అవార్డు) క్రెడిట్‌ మొత్తం ఆడియన్స్‌కి ఇస్తాను’’ అని చెప్పారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025లో విడుదలైన చిత్రాలకు గద్దర్‌ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ  చిత్రానికి గాను బెస్ట్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి పంచుకున్న విశేషాలు... 

⇒ గద్దర్‌ అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. కమర్షియల్‌గా బాక్సాఫీస్‌ విక్టరీ, అలాగే అవార్డ్స్‌ కూడా రావడం అంటే ఒక దర్శకుడికి అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్‌లో చాలా స్పెషల్‌ ఫిల్మ్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ఒక చిన్న సందేశాన్ని చెబుతూ డిఫరెంట్‌ జానర్‌లో నేను ప్రయత్నించిన సినిమా ఇది. ‘భగవంత్‌ కేసరి’ వంటి సీరియస్‌ డ్రామా తర్వాత ఒక ఎంటర్‌టైన్మెంట్‌ సినిమా చేశాను. అది బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేసింది. నా కెరీర్‌కి మంచి బూస్ట్‌ ఇచ్చింది. 

⇒ నా తర్వాతి సినిమాను వెంకటేశ్‌గారితోనే చేస్తున్నాను. ఈ సమయంలో నేను ఆయనతో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’కు అవార్డు రావడం అనేదిపాజిటివ్‌ వైబ్‌లా అనిపించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో క్యారెక్టర్స్‌కు, సీన్స్‌ మధ్య స్క్రీన్‌ప్లే చక్కగా కుదిరింది. స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డు రావడం అనేది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ‘దిల్‌’రాజు, శిరీష్‌గార్లతో నేను ఆరు సినిమాలు చేశాను. వాళ్లను నా ఫ్యామిలీలా ఫీలవుతాను. వాళ్ల బ్యానర్‌లో నేను చేసిన సినిమాకు గద్దర్‌ అవార్డు రావడం ఆనందాన్నిచ్చింది. ∙నా తర్వాతి సినిమాలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌గార్లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కొంచెం కష్టమైన స్క్రిప్ట్‌. రెండు నెలల సమయం పడుతుంది. జూన్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి, నవంబరులో పూర్తి చేసి, సంక్రాంతికి రిలీజ్‌ చేస్తాం.  

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)