వీరిద్దరి కాంబో సూపర్ హిట్‌.. మరోసారి గ్రీన్ సిగ్నల్!

Published on Mon, 11/24/2025 - 21:19

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. వీటిలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో అజిత్ మరోసారి ఆయనతో జతకట్టనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ వెల్లడించారు.

చెన్నైలో ఓ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ గుడ్ న్యూస్‌ పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. మేము ఇప్పుడు లొకేషన్స్ ఖరారు చేస్తున్నామని.. ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశముంది.

కాగా.. అజిత్ కుమార్‌ ఈ ఏడాది సినిమాలతో పాటు కార్ రేసింగ్‌లోనూ దూసుకెళ్తున్నారు. ఇటీవలే ఇటలీకి చెందిన మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ నుంచి 'జెంటిల్‌మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రశంసలు అందుకుంది.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)