Breaking News

'మరాఠీ మాట్లాడను, దమ్ముంటే మహారాష్ట్ర నుంచి నన్ను వెళ్లగొట్టండి'

Published on Sun, 07/06/2025 - 16:25

మరాఠీలో మాట్లాడనందుకు ఓ స్వీట్‌ షాప్‌ యజమానిని కొట్టిన ఘటన కలకలం రేపింది. అయితే తాను కూడా మరాఠీ మాట్లాడనని, దమ్ముంటే తనను మహారాష్ట్ర నుంచి తరిమేయండి అని సవాల్‌ విసిరారు భోజ్‌పురి నటుడు, బీజేపీ ఎంపీ దినేశ్‌ లాల్‌ యాదవ్‌ (Dinesh Lal Yadav). ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హమర్‌ నామ్‌ బా కన్హయ్య.

చెత్త రాజకీయాలు
ఈ సినిమా ప్రమోషన్స్‌లో దినేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మరాఠీ మాట్లాడలేదని దాడి చేస్తారా? ఇవన్నీ చెత్త రాజకీయాలు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసేవారు అలాంటివాటికి దూరంగా ఉంటే బాగుంటుంది. మీకంత దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి వెళ్లగొట్టండి చూద్దాం.. నేను మరాఠీ మాట్లాడను. రాజకీయ నాయకులందరికీ నేను సవాల్‌ విసురుతున్నా.. నేను ఇక్కడే ఉంటాను. దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి.

నేర్చుకోకపోతే తప్పేం కాదు
నేను కూడా రాజకీయ నాయకుడినే.. పాలిటిక్స్‌ అనేవి.. ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలే తప్ప వారిని దగా చేయడానికి కాదు. ఎవరికైనా పలు భాషలు నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకుంటారు. మరాఠీ అందమైన భాష.. భోజ్‌పురి, తెలుగు, తమిళం, గుజరాతీ.. ఈ భాషలన్నీ అందరూ నేర్చుకోవచ్చు. అలాగే ఎవరూ నేర్చుకోకపోయినా ఏం పర్వాలేదు. అంతేకానీ, ఫలానా భాష  ఎందుకు నేర్చుకోలేదని టార్గెట్‌ చేయడం కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చారు. దినేశ్‌ లాల్‌ యాదవ్‌ను నిరాహువా అని కూడా పిలుస్తుంటారు. భోజ్‌పురిలో అనేక సినిమాలు చేసిన ఈయన హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్నారు.

చదవండి: కలిసిపోయిన తెలుగు హీరోల ఫ్యాన్స్‌.. ఆ కన్నడ హీరోపై ట్రోలింగ్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)