Breaking News

డింపుల్‌తో డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారు : న్యాయవాది

Published on Thu, 05/25/2023 - 16:32

హీరోయిన్‌ డింపుల్‌ హయాతి, డీసీపీ రాహుల్‌ హెగ్డేల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూపై డింపుల్‌ న్యాయవాది పాల్‌ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులను హింసిస్తుంటే డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. ''డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

డింపుల్‌ పార్లింగ్‌ ప్లేసులో కావాలనే కోన్స్‌ పెట్టారు. అయినా రోడ్డుపై వుండాల్సిన సిమెంట్ బారికేడ్స్, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నాం. జంతువులను హింసిస్టుంటే డింపుల్‌ వారించింది. అందుకే ఆ కక్షతోనే డీసీపీ ఇలా తప్పుడు కేసు పెట్టారు. డింపుల్‌ ఎక్కడా కారును తన్నిన ఫుటేజీ లేదు. 

కానీ ఆమెను తప్పుగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. జరిగిన పరిణామాలు చూసి డింపుల్‌ మానసిక ఒత్తిడికి గురైంది, ఆమె బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతుంది. డీసీపీ నుంచి డింపుల్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే ఆమెకు చాలా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ఈ కేసను న్యాయపరంగా ఎదుర్కొంటాం'' అంటూ ఆమె న్యాయవాది పేర్కొన్నారు. 



 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)