Breaking News

బలగం మూవీ.. ఆడియన్స్‌కు షాకిచ్చిన దిల్ రాజు!

Published on Mon, 04/03/2023 - 16:16

పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లెల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపించారు. చిన్న సినిమా హృదయాలకు హత్తుకునేలా చేశారు దర్శకుడు వేణు. అంతలా విజయం సాధించిన ఈ చిత్రంపై ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక గ్రామాల్లో అయితే ఏకంగా అందరూ ఒకచోట చేరి మరీ పెద్ద తెరలపై చూస్తున్నారు. కుటుంబ సభ్యుల భావోద్వేగాలకు కనెక్ట్ కావడంతో సినిమా చూసిన వారు కన్నీళ్లు ఆపులేకపోతున్నారు. 

ఇంతగా భారీ విజయం సాధించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తూ.. అవార్డులు కూడా కొల్లగొడుతోంది. అయితే తాజాగా బలగం సినిమా మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కూడా ఎవరో కాదు. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్‌ రాజు టీమ్‌ కావడం గమనార్హం. వేణు ఎల్దండి మొదటిసారి దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు వారసులు హన్షిత, హర్షిత్ రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

తన సినిమాకు సక్సెస్ వస్తే ఏ నిర్మాత అయినా సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ అందుకు భిన్నంగా దిల్‌ రాజు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రాన్ని గ్రామాల్లో పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించడమే. ఇలా చేయడం నేరమని ఆరోపిస్తూ నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది దిల్‌ రాజు టీం. తమ అనుమతి లేకుండా ఇలా చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీని కోరారు. ఇలా చేయడం వల్ల తమ ఆదాయానికి గండి పడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూసి సంతోషించాల్సింది పోయి.. ఫిర్యాదు చేస్తారా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)