Breaking News

‘పెద్ది’ వస్తే.. ‘గాయపడ్డ సింహం’ వాయిదా వేస్తాం : దిల్‌ రాజు

Published on Tue, 03/24/2026 - 11:29

‘‘గాయపడ్డ సింహం’ మూవీ గురించి తరుణ్‌ భాస్కర్‌ చెప్పాడు. డైరెక్టర్‌ పవన్‌ని ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి అడిగితే.. టీజర్‌ చూపించారు. టీజర్‌ చాలా నచ్చింది. ఆ తర్వాత మొత్తం కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని మా  శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై  రిలీజ్‌ చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు చెప్పారు. 

తరుణ్‌ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్‌ పవన్‌ సాధినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్‌ బ్యానర్లపై కల్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్‌ ప్రతాప, విజయ్‌ కృష్ణ లింగమనేని, ఉమేష్‌ బన్సాల్‌ నిర్మించారు. ఈ మూవీ విడుదల హక్కులను ‘దిల్‌’ రాజు కొనుగోలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. 

ఈ సందర్భంగా ‘దిల్‌’రాజు మాట్లాడుతూ – ‘‘మే 1న ఈ సినిమా రిలీజ్‌ అవుతుందని ప్రకటించాం. అయితే ఏప్రిల్‌ 30కి ‘పెద్ది’ సినిమా వస్తే ‘గాయపడ్డ సింహం’ విడుదల తేదీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా కోసం పవన్‌గారు. నిర్మాతలు, జీ టీమ్‌ సపోర్ట్‌ చేశారు’’ అన్నారు కశ్యప్‌ శ్రీనివాస్‌. ‘‘మాలాంటి యంగ్‌ ఫిలిం మేకర్స్‌ని సపోర్ట్‌ చేస్తున్న ‘దిల్‌’ రాజు గారికి ధన్యవాదాలు’’ అని భాను కిరణ్‌ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్‌ 30న ‘పెద్ది’ వస్తోంది. మా మూవీకి థియేటర్స్‌ విషయంలో ఇబ్బందులు కలిగితే విడుదల తేదీ మార్చుకుంటాం’’ అని పవన్‌ సాధినేని చెప్పారు.  

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)