Breaking News

ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచింది: దిల్ రాజు

Published on Wed, 12/18/2024 - 14:53

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‍గా  ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు(వెంకట రమణ రెడ్డి) బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం ఆయన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ‍సందర్భంగా అవకాశమిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు సినిమా పూర్వ వైభవం తీసుకురావడానికి అందరి సహకారం అవసరమని దిల్ రాజు అన్నారు. తెలంగాణా సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాతనే  గుర్తింపు వచ్చిందని.. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.

కాగా.. ఈ రోజు దిల్ రాజు పుట్టినరోజు కావడం మరో విశేషం. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చే ఏడాది పొంగల్‌కు విడుదల కానున్నాయి. నితిన్‌ హీరోగా నటిస్తున్న తమ్ముడు చిత్రానికి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)