Breaking News

'గేమ్‌ ఛేంజర్' ఫస్ట్‌ డే కలెక్షన్ల పోస్టర్‌పై దిల్‌ రాజు కామెంట్స్‌

Published on Sun, 02/02/2025 - 13:12

రామ్‌ చరణ్‌ (Ram Charan), శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పొలిటికల్‌ డ్రామా చిత్రం 'గేమ్‌ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, అదంతా ఫేక్‌ కలెక్షన్స్‌ అంటూ నిర్మాత దిల్‌ రాజుపై నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఇదే సమయంలో గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌ డే నాడు కేవలం రూ. 80 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టిందని పలు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ పోస్టర్‌ గురించి ఆయన రెస్పాండ్‌ అయ్యారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయం అందుకోవడంతో డిస్ట్రిబ్యూటర్స్‌ గ్రాటిట్యూడ్‌ మీట్‌ పేరుతో మేకర్స్‌ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ నిర్మాత దిల్‌ రాజుకు ఒక ప్రశ్న ఎదురైంది. సంక్రాంతి పండుగ సమయంలో మీరు రెండు సినిమాలు విడుదల చేస్తే.. ఒక సినిమాకు మొదటిరోజు కలెక్షన్ల వివరాలు మాత్రమే చెప్పి.. రెండో సినిమాకు చాలా పోస్టర్లతో ఆ వివరాలు చెప్పడం వెనుకున్న కారణం ఏంటి అని విలేఖరి ప్రశ్నించారు. 

అందుకు దిల్‌ రాజు కాస్త అసహనంగానే ఇలా చెప్పారు.  'ఈ విషయంలో మాకు కొన్ని బలహీనతలు ఉంటాయి.  మీకు కూడా (మీడియా) తెలుసు కదా..! మళ్లీ నన్నెందుకు అడుగుతున్నారు. ప్రతి సినిమా కలెక్షన్ల వివరాలు మీ వద్దే ఉంటాయని అందరూ అంటున్నారు. ఇక నుంచి కలెక్షన్ల వివరాలు కూడా మీరే ప్రకటించండి.' అని అసహనంగా దిల్‌ రాజు అన్నారు. అయితే ఇదే సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్‌ కూడా కలెక్షన్స్‌ పోస్టర్స్‌ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మేకర్స్‌ విడుదల చేస్తున్న కలెక్షన్ల పోస్టర్స్‌ను చూసి ప్రేక్షకులు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)