Breaking News

అందులో నిజం లేదు.. సీఎంతో భేటీ తర్వాత 'దిల్‌ రాజు' వ్యాఖ్యలు

Published on Thu, 12/26/2024 - 13:41

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసిన అనంతరం  ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు, పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన అన్నారు.  తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఇండస్ట్రీతో ప్రభుత్వం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు దిల్‌ రాజు అన్నారు.

గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలన కోసం హీరోలు, హీరోయిన్లు తమ వంతుగా పాటు పడుతారని దిల్‌ రాజు అన్నారు. ఐటీ, ఫార్మాతో సమానంగా సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో హాలీవుడ్‌ సినిమాలు నిర్మించేలా పాటుపడాలని సీఎం సూచించినట్లు దిల్‌ రాజు అన్నారు. తెలంగాణలో సామాజిక అంశాలలో నటీనటులు ఇక నుంచి పాల్గొంటారని ఆయన అన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్‌షోలు వంటి అంశాలు చాలా చిన్నవని ఆయన అన్నారు.  

సీఎం రేవంత్‌రెడ్డితో తమ సమావేశం సానుకూలంగానే జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఇండస్ట్రీ పనిచేస్తుందని ఆయన అన్నారు. కొన్ని సంఘటనల వల్ల చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి దూరం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. త్వరలో తామందరం కూడా ఒక మీటింగ్‌ పెట్టుకుని సినిమా పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అవసరాలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని  ఆయన అన్నారు.  

రూమర్స్‌పై స్పందించిన దిల్‌ రాజు..

సీఎంతో భేటీ తరువాత పలు మాధ్యమాల్లో వస్తున్న ఫేక్ వార్తలపై దిల్ రాజు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ చాలా బాగా జరిగిందన్నారు. అరశాతం కూడా నెగిటివ్ లేదని.. సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని తెలిపారు.  బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదని..  పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు చూపించలేదని అన్నారు. బౌన్సర్స్ విషయంలో ప్రతిదీ అకౌంటబిలిటీగా ఉండాలని డీజీపీ సూచించినట్లు దిల్‌ రాజు వెల్లడించారు.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)