Breaking News

షూటింగ్‌లో రచ్చ చేసిన బాయ్‌ ఫ్రెండ్‌, సినిమా నుంచి హీరోయిన్‌ ఔట్!

Published on Sat, 06/07/2025 - 10:56

సినిమా రంగం అంటే విశేషాలకే కాదు వివాదాలకూ చిరునామా. అయితే చాలా వరకూ వివాదాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో అంతే వేగంగా మరుగునపడిపోతుంటాయి. అయితే  కలకాలం నిలిచే కొన్ని సినిమాల్లాగా కొన్ని వివాదాలు కూడా ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి. దానికి కారణం ఆయా వివాదాలకి  లేదా ఆ సంఘటనలకి ఉన్న శక్తి, లేదా ప్రత్యేకతలే అని చెప్పొచ్చు. అలాంటిదే ఒక సంఘటన దాదాపు రెండు దశాబ్ధాల క్రితం జరిగింది. 

ఈ వివాదానికి కేంద్ర బిందువులుగా నిలిచిన వారు అందరూ భారతీయ సినీరంగంలో అత్యంత ప్రముఖులు కావడం మాత్రమే కాదు... ఎన్నో రకాల మనస్ఫర్ధలకు కాలాలకు  స్నేహల విఛ్చిన్నానికి దారి తీయడం కూడా ఆ ఒకే సంఘటనను చిరస్మరణీయంగా మార్చింది. ఆ సంఘటనకు ఉన్న గాఢత వల్ల దానికి సంబంధించిన నటీనటులు కూడా తరచుగా దాన్ని పలు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకుంటూ ఉండడం కూడా కనిపిస్తుంటుంది. ఆ సంఘటనకు ప్రస్తుత బాలీవుడ్‌ అగ్రగామి నటుడు సల్మాన్‌ఖాన్‌ ప్రధాన కారణమైతే, ప్రస్తుత అభిషేక్‌ బచ్చన్‌ భార్య, బాలీవుడ్‌ ప్రముఖురాలు ఐశ్వర్యరాయ్‌ ప్రధాన బాధితురాలుగా చెప్పొచ్చు.

వివరాల్లోకి వెళితే...గత 2003లో విడుదలైన చళ్తే చళ్తే సినిమాలో షారుఖ్‌ ఖాన్‌( Shah Rukh Khan) సరసన ఐశ్వర్య రాయ్‌ ( Aishwarya Rai Bachchan) ప్రధాన పాత్రకు ఎంపికయ్యారు. అయితే ఒక పాట (‘ప్రేమ నగరియా‘) చిత్రీకరణ సమయంలో, అప్పటి ఆమె తాజా మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ టాప్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ షూటింగ్‌ స్పాట్‌కు వచ్చాడు. అక్కడ నానా రభసా సృష్టించాడు.  నాలుగున్నర గంటల పాటు కలకలం సృష్టించాడు. దాంతో   దర్శకుడు అజీజ్‌ మిర్జా షూటింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత ఐశ్వర్య, సల్మాన్‌ ఇద్దరూ షారుఖ్‌కు క్షమాపణలు చెప్పినా, నిర్మాతలు ప్రాజెక్ట్‌ భద్రత కోసం ఆమెను చిత్రంలో నుంచి తప్పించారు.

ఇది తనను ఎంతగానో బాధించిందని ఇప్పటికీ ఐశ్వర్య పలుమార్లు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకుంటుంటారు. తన తప్పేం లేకపోయినా ఆ సినిమా నుంచి తనను తప్పించడం అనేది ఆమెను ఎంతో కాలం వేదనకు గురి చేసింది. ఆ తర్వాత షారుఖ్‌ ఖాన్‌ కూడా ఆ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశాడు. ‘ఐశ్వర్య నా సన్నిహిత స్నేహితురాలు. ఆమెను నా సినిమా నుంచి తప్పించాల్సి రావడం చాలా బాధాకరం. కానీ ఆ సినిమాకు నేను ఒక్కడినే నిర్మాత కాదు. మా కంపెనీ ప్రతిష్ట పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడడంతో, ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అంటూ షారూఖ్‌ అన్నాడు.

అయితే ఆ తర్వాత కూడా  షారుఖ్‌ ఖాన్‌తో కలిసి నటించాల్సిన ఐదు సినిమాల నుంచి కూడా ఐశ్వర్య రాయ్‌ను తప్పించారని, కానీ ఎందుకు అనే వివరణ కూడా ఇవ్వలేదని ఐశ్వర్య సన్నిహితుల దగ్గర వాపోయింది.  ఈ అనూహ్య పరిణామం ఆమెను బాధించింది. అప్పటి నుంచీ షారూఖ్‌ ఐశ్వర్య, సల్మాన్, షారూఖ్‌ల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. అలాగే అంతకు ముందు రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్‌ ఇద్దరూ మంచి స్నేహితులు అయితే ఐశ్వర్యరాయ్‌ను తొలగించిన తర్వాత ఆ స్థానంలో చళ్తే చళ్తే సినిమాలో రాణి ముఖర్జీ నటించడం జరిగింది. ఈ పరిణామం తర్వాత, వారిద్దరి మధ్య స్నేహ బంధం కూడా ముక్కలైంది. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య పూర్తయిన చళ్తే చళ్తే సినిమా మాత్రం  ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే, అంతకు ముందు ఎప్పుడూ లేనట్టుగా ఈ సినిమా వెనుక జరిగిన సంఘటన చిరకాల మిత్రులను శతృవులుగా, స్నేహాలను విడగొట్టి బాలీవుడ్‌ చరిత్రలో తనదైన చరిత్రను స్వంతం చేసుకుంది.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)