సూర్య 'కంగువా'.. రూ.2000 కోట్ల కలెక్షన్స్ సాధ్యమేనా?

Published on Fri, 11/15/2024 - 09:42

సూర్య 'కంగువా' సినిమా ప్రేక్షకులు ముందుకొచ్చేసింది. అయితే రిలీజ్‌కి కొన్నాళ్ల ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. ఈ మూవీ ఏకంగా రూ.2000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తోందని, డౌట్ లేదంటూ చాలా పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు. అప్పట్లోనే ఈ మాటలు కాస్త‪‌ ఓవర్‌గా అనిపించాయనే కామెంట్స్ వినిపించాయి. మరి 'కంగువ' ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? 2000 కోట్లు వసూళ్లు అయ్యే పనేనా?

కోలీవుడ్ 'బాహుబలి' అని చెప్పి 'కంగువా' సినిమాని ప్రచారం చేశారు. ట్రైలర్ చూస్తే వర్కౌట్ అయ్యే కంటెంట్ అనే చాలామంది అనుకున్నారు. కానీ రియాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంది. టీమ్ అంతా కష్టపడ్డారు గానీ కథ, స్క్రీన్ ప్లే విషయంలో తీసికట్టుగా వ్యవహరించారు. ప్రస్తుత జనరేషన్ సూర్యకి సంబంధించిన 20-25 నిమిషాల ఎపిసోడ్ సినిమా మొదటలో ఉంటుంది. ఇదైతే మరీ చిరాకు పుట్టేంచేలా ఉంటుంది.

(ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)

పీరియాడిక సెటప్‌లో ఉంటే సూర్య గెటప్ బాగానే ఉంది. కానీ ఆ సీన్లు మరీ సాగదీతగా, ఆడియెన్స్‌కి కనెక్ట్ కాని విధంగా ఉన్నాయి. స్క్రీన్‌పై యుద్ధాలు జరుగుతుంటాయి. యాక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రేక్షకులకు పెద్దగా ఫీలవరు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. వీకెండ్ వరకు అంటే ఏదోలా మేనేజ్ అయిపోతుంది గానీ ఆ తర్వాత మాత్రం ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే దానిబట్టి ఉంటుంది.

సూర్య 'కంగువా' చిత్రానికి తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ.50 కోట్ల లోపే గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలానే తక్కువ నంబర్స్ వస్తే రూ.2000 కోట్లు కాదు కదా.. లాంగ్ రన్ లో రూ.1000 కోట్లు రావడం కూడా కష్టమే! ఇప్పటికే తెలుగులో ఈ మార్క్ చేరుకున్న సినిమాలు బోలెడున్నాయి. తమిళ ఇండస్ట్రీ మాత్రం రూ.1000 కోట్ల వసూళ్ల కోసం మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదేమో?

(ఇదీ చదవండి: సూర్య 'కంగువా' ఏ ఓటీటీకి రానుందంటే?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)