Breaking News

మహేశ్‌బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?

Published on Fri, 08/25/2023 - 18:43

స్టార్ హీరో అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. 'పుష్ప' మూవీ రిలీజైనప్పుడు బన్నీ గురించి ఎంత మాట్లాడుకున్నారో.. అవార్డు రావడంతో అంతకంటే ఎక్కువగానే మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో హీరో మహేశ్ బాబు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. 

ఫస్ట్ ఛాయిస్ మహేశ్
'రంగస్థలం' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మహేశ్‌తో సినిమా చేయాలని డైరెక్టర్ సుకుమార్ ఫిక్సయ్యాడు. ముందుగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో ఓ స్టోరీ అనుకున్నారట. కొన్నాళ్లకు ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై సుక్కు.. ఓ లైన్ రెడీ చేశాడు. మహేశ్‌తో ఈ మూవీ చేయాలనుకుని.. ఏడాది పాటు దీనిపై వర్క్ చేశారట. కానీ మహేశ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. అప్పట్లో దీనిపై మహేశ్ ట్వీట్ కూడా పెట్టాడు. 

(ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?)

లైన్‌లోకి బన్నీ
మహేశ్‌తో సినిమా అనుకున్నప్పుడు ఓ లైన్ రెడీ చేసిన సుకుమార్.. దాన్ని బాగా డెవలప్ చేసి అల్లు అర్జున్ కి వినిపించాడట. అలా ఈ కాంబో సెట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు 'పుష్ప' అనేది మూవీ కాదు బ్రాండ్ అనేంతలా మారిపోయింది. అల్లు అర్జున్ కి నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది.

ఛాన్స్ మిస్?
ఇప్పుడు 'పుష్ప' సినిమాకుగానూ అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు రావడంతో మహేశ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే సుక్కు.. మహేశ్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు హీరోగా పోలీస్ క్యారెక్టర్ అనుకున్నారట. కానీ బన్నీ లైన్ లోకి వచ్చేసరికి అది కాస్త కూలీ టూ డాన్ పాత్రగా మారింది. కాబట్టి మహేశ్ ఎలాంటి అవకాశం మిస్ చేసుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు వేేర్వేరు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ చేసుంటే అప్పుడు మహేశ్‌కి జాతీయ అవార్డు వచ్చుండేదా లేదా అనేది అప్పుడు తెలిసేది తప్పు ఇప్పుడు ఈ డిస్కషన్ అనవసరం.

(ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?)

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)