Breaking News

పాక్‌ నటుడికి బాలీవుడ్‌ బ్యూటీ సపోర్ట్‌.. వారిపై బ్యాన్‌ సరికాదంటూ!

Published on Fri, 04/25/2025 - 08:12

పాకిస్తాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ (Fawad Khan) బాలీవుడ్‌లో కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అతడు హీరోగా నటించిన అబీర్‌ గులాల్‌ మూవీ (Abir Gulal Movie) మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. ఇంతలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో పాక్‌పై భారత్‌ తీవ్ర చర్యలకు పూనుకుంది. పాకిస్తాన్‌ సింధూనదీ జలాలు ఇచ్చేది లేదని నిర్ణయించుకుంది. అలాగే పాక్‌ నటులపై, వారి సినిమాలపై నిషేధం విధించింది.

పాక్‌ నటులపై ద్వేషం వద్దు
అబీర్‌ గులాల్‌ మూవీని భారత్‌లో బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఫవాద్‌ ఖాన్‌ రీఎంట్రీ పట్ల బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా (Dia Mirza) సంతోషం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో దియా మాట్లాడుతూ.. నటులపై బ్యాన్‌ విధించడం సరి కాదు. సినిమా, స్పోర్ట్స్‌ను ద్వేషంతో చూడకూడదు. ఫవాద్‌ తిరిగి రావడం సంతోషకరం. త్వరలోనే మనమంతా అతడిని వెండితెరపై చూడబోతున్నాం. తర్వాత అతడికి మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై నెట్టింట ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక చాలు ఆపండి
పాక్‌ నటుడికి సపోర్ట్‌ చేయడమేంటని పలువురూ దిశాను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సోషల్‌ మీడియా వేదికగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. వాస్తవాలను తప్పుగా చూపించడం ఆపండి. ఏప్రిల్‌ 10న నా సినిమా కోసం ఈ ఇంటర్వ్యూ చేశాను. అంటే ఉగ్రదాడి జరగడానికి చాలా కాలం ముందు మాట్లాడిన వ్యాఖ్యలివి. వాటిని ఇప్పుడు తీసుకొచ్చి, అసందర్భంగా ప్రచారం చేయడం ఆపండి. ఇది అనైతికం.. అలాగే తీవ్ర అభ్యంతరకరం కూడా! అని రాసుకొచ్చింది. బాలీవుడ్‌లో అనేక సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో వైల్డ్‌ డాగ్‌ చిత్రంలో యాక్ట్‌ చేసింది. ఇకపోతే ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.

చదవండి: ప్రభాస్ ది రాజాసాబ్‌.. టీజర్‌ రిలీజ్‌పై హింట్‌ ఇచ్చిన డైరెక్టర్‌!

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)