Breaking News

కీరవాణి పాటలో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా చేశా: హీరోయిన్‌

Published on Wed, 03/29/2023 - 17:12

2000 సంవత్సరంలో మిస్‌ ఇండియా పోటీల్లో మిస్‌ ఆసియా పసిఫిక్‌ కిరీటాన్ని అందుకోవడానికి ముందు దియా మీర్జా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఈ కిరీటం అందుకున్న తర్వాత సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా పాపులర్‌ అయింది దియా. అయితే దీనికంటే ముందు ఆమె ఓ తమిళ సినిమాలో కూడా నటించింది. కాకపోతే ఎటువంటి ప్రాధాన్యత లేని ఓ చిన్న పాత్రలో! తాజాగా ఈ విషయాన్ని దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

'1999లో ఎన్‌ శ్వాస కాట్రే అనే తమిళ చిత్రం చేశాను. కేఎస్‌ రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరవింద్‌ స్వామి, ఇషా కొప్పికర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో జుంబలక్కా అనే పాటలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా, సైడ్‌ డ్యాన్సర్‌గా నటించాను. సరిగ్గా చెప్పాలంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్స్‌ట్రాగా ఉన్నాను. నాకు డబ్బులవసరం కావడంతో ఈ సాంగ్‌ చేశాను. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ జరిగింది. షూటింగ్‌ అంతా ఎంతో బాగా జరిగింది.

నాకు బాగానే డబ్బులిచ్చారు. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా, రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు' అని చెప్పుకొచ్చింది. తర్వాతి ఏడాది మిస్‌ ఆసియా పసిఫిక్‌ కిరీటాన్ని అందుకున్న తర్వాత దియా మీర్జా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెహనా హై తేరే దిల్‌ మే, దీవానాపన్‌, దమ్‌, లగే రహో మున్నా భాయ్‌ వంటి పలు చిత్రాలు చేసింది. తెలుగులో వైల్డ్‌ డాగ్‌ సినిమాలో నటించింది. ఇటీవల రిలీజైన భీద్‌లోనూ మెరిసింది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)