Breaking News

చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్‌ మాస్టర్‌ మేనమామ

Published on Mon, 05/01/2023 - 12:41

కొరియోగ్రాఫర్‌ చైతన్య మాస్టర్‌ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధ భరించలేకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అయితే తనకు తెలిసినంతవరకు చైతన్యకు ఎలాంటి అప్పులు లేవని ఆయన మేనమామ అంటున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. చైతన్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అలాగని తనకు పెద్ద మొత్తంలో అప్పులున్నాయని కూడా నేను అనుకోవడం లేదు. తనకు లక్షల కొద్ది అవసరం ఏముంటుందని? అయినా అంత అప్పు ఎవరిస్తారు?

మహా అయితే ఏదో పది, పదిహేను వేలు అ‍ప్పు చేసి ఉంటాడంతే! ఇంకేదో జరిగింది. చైతన్య చెల్లి పెళ్లి కూడా మేమే చేశాం. తను రూపాయి ఇవ్వలేదు. అతడు చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నాడు. తన ఆదాయంపై కుటుంబం ఏనాడూ ఆధారపడలేదు. తను సంపాదించిందేమీ ఇంటికి పంపించేవాడు కాదు. పైగా తనకు అవసరమైనప్పుడల్లా వీళ్లే చైతూకు తిరిగిచ్చేవాళ్లు. తనకు ఊర్లో 30 ఎకరాల భూమి ఉంది. అప్పులు కాకుండా మరింకేదైనా కారణం ఉండొచ్చు' అని అనుమానం వ్యక్తం చేశాడు ఆయన మేనమామ.

కాగా చైతన్య మరణంపై పలువురు డ్యాన్సర్లు, సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చైతన్య మాస్టర్‌ ఓ ఈవెంట్‌ ఒప్పుకున్నాడని, తీరా సమయానికి కొందరు డ్యాన్సర్లు ఆయనకు హ్యాండ్‌ ఇవ్వడంతో మేనేజ్‌మెంట్‌ టీమ్‌ పేమెంట్‌ ఇవ్వకుండా ఆపేసిందని డ్యాన్సర్‌, కండక్టర్‌ ఝాన్సీ పేర్కొంది. ఈవెంట్‌కు వచ్చిన మిగతా డ్యాన్సర్లకు డబ్బులు ఇచ్చేందుకు మాస్టర్‌ వేరే వాళ్ల దగ్గర అప్పు చేశాడని, బహుశా ఆ ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆమె అభిప్రాయపడింది.

చదవండి: చైతన్య మాస్టర్‌ ఆత్మహత్య, గుండె బద్ధలైందన్న శేఖర్‌ మాస్టర్‌
రూ.7 లక్షలు రావాల్సి ఉంది.. పేమెంట్‌ ఇవ్వలేదు: కండక్టర్‌ ఝాన్సీ

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)