Breaking News

నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్‌

Published on Mon, 07/22/2024 - 00:59

‘‘నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ మంచి దర్శకులతో పనిచేశాను. వాళ్లందరి దగ్గరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటూ వచ్చి డైరెక్టర్‌ అయ్యాను. నాకు నటనకంటే కూడా డైరెక్షన్‌ అంటే ఎక్కువ ఇష్టం’’ అని ధనుష్‌ అన్నారు. ఆయన హీరోగా నటì ంచి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్‌’. ప్రకాశ్‌ రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్‌ కిషన్  కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్‌ నిర్మించిన ‘రాయన్‌’ ధనుష్‌ కెరీర్‌లో 50వ సినిమా.

ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో రిలీజ్‌ అవుతోంది. ఆదివారం  హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ధనుష్‌ మాట్లాడుతూ–‘‘నేను ముఖ్యంగా రెండు విషయాలకు  కృతజ్ఞతలు చె΄్పాలనుకుంటున్నాను.

 ఒకటి.. నా మొదటి సినిమా నుంచి 49వ సినిమా వరకూ నేను పని చేసిన దర్శకులందరికీ కృతజ్ఞతలు. రెండోది.. నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు. ఈ వేడుకలో నా గత చిత్రాలకు సంబంధించిన ఏవీ వేసినప్పుడు నాకు చాలా తప్పులు కనిపించాయి. ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక గొప్పగా చెప్పుకునే సినిమా ఇవ్వాలనే ‘రాయన్‌’ చేశాను. తెలుగులో ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్‌ చేయాలనుంది. 

నాకు తెలుగు వంటకాల్లో ఆవకాయ పప్పన్నం అంటే ఇష్టం’’ అన్నారు. ‘‘ధనుష్‌ సౌత్‌ ఇండియా, నార్త్‌ ఇండియా అని కాకుండా ఇండియన్‌ ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్‌ హీరో అండ్‌ ఫైనెస్ట్‌ ఆర్టిస్ట్‌ అనిపించుకున్నారు. క్రిస్మస్‌కి ‘గేమ్‌ చేంజర్‌’ సినిమాతో కలుద్దాం’’ అన్నారు ‘దిల్‌’ రాజు. ‘‘రాయన్‌’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు డి. సురేష్‌బాబు. నిర్మాతలు సునీల్‌ నారంగ్, భరత్‌ నారంగ్, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)