Breaking News

ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా

Published on Fri, 11/08/2024 - 11:46

సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే మిగతా ఏ ఇండస్ట్రీల్లోనూ ఆ టైమ్‪‌కి వేరే పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్‌కి పెట్టుకోరు. ఒకవేళ అలా కాదనుకుంటే షారుక్ 'డంకీ' మూవీకి అయినట్లు కలెక్షన్స్ డ్యామేజ్ అవ్వొచ్చు. కానీ తమిళ హీరో ధనుష్ మాత్రం తన కొత్త మూవీని 'రాజాసాబ్'కి పోటీగా బరిలో నిలబెట్టాడు.

సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు.

(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)

ఇకపోతే ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా 'ఇడ్లీ కడై' (ఇడ్లీ మాత్రమే). ఇప్పుడు ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 10నే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ మూవీ అంటే తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ మూవీ ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. తమిళంలో మాత్రం థియేటర్ల, కలెక్షన్ దగ్గర 'రాజాసాబ్'కి ఇ‍డ్లీ మూవీ వల్ల ఇబ్బంది ఉండొచ్చు.

ధనుష్ అదే తేదీన తన మూవీ రిలీజ్ చేయడానికి కారణముందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఉగాది ఉన్నట్లే తమిళ న్యూ ఇయర్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఉంది. దీంతో ఆ లాంగ్ వీకెండే ధనుష్ టార్గెట్. ఇదంతా చూస్తుంటే 'రాజాసాబ్' రిలీజ్‌తోపాటు ధనుష్ మూవీ రిలీజ్ విషయంలోనూ మార్పు ఉండకపోయే అవకాశాలే ఎక్కువ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు హిట్ సినిమాలు.. ఏది ఎందులో?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)