Breaking News

చెన్నైలో లగ్జరీ ఇల్లు కట్టిన ధనుష్‌.. ఎన్ని కోట్లో తెలుసా?

Published on Mon, 02/20/2023 - 14:06

సార్‌ సినిమాతో మరో సక్సెస్‌ తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్‌ హీరో ధనుష్‌. ఇకపోతే ధనుష్‌ కొత్తింటి కోసం కలలు కంటున్నట్లు గతేడాది వార్తలు వచ్చాయి. చెన్నైలో ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తున్నాడని, ఇందుకోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడని ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఇదే నిజమైంది. చెన్నైలోని పోయిస్‌ గార్డెన్‌లో లగ్జరీ ఇంటిని నిర్మించాడు ధనుష్‌. దీని విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే ధనుష్‌ తన పేరెంట్స్‌తో కలిసి గృహప్రవేశం కూడా పూర్తి చేశాడు.

ఇక ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు గిఫ్ట్‌ ఇచ్చినట్లు భోగట్టా. ప్రస్తుతం ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ధనుష్‌, తల్లిదండ్రులతో పాటు అతడి స్నేహితులు కూడా ఉన్నారు. దర్శకుడు సుబ్రహ్మణ్యం శివ ఈ కొత్తింటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. 'ధనుష్‌ ఇల్లు దేవాలయంలా ఉంది. తల్లిదండ్రులను బతికి ఉన్నప్పుడే స్వర్గంలో నివసించేలా చేసి వారిని దేవుళ్లలా కొలుస్తున్నాడు. గ్రేట్‌' అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)