Breaking News

'దందా' సిరీస్ రివ్యూ

Published on Sun, 08/02/2026 - 19:03

యూట్యూబర్ దొరసాయి తేజ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'దందా'. ఛాయ్ షాట్స్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
అరవింద్ (దొర సాయి తేజ) బీటెక్ స్టూడెంట్. డబ్బు, అధికారంపై బలమైన కోరిక ఉంటుంది. తరగతి గదిలో కంటే హైదరాబాద్ డార్క్ సైబర్ క్రైమ్ ప్రపంచంలోనే తన తెలివితేటలకు గుర్తింపు దక్కుతుందని అనుకుంటాడు. చిన్న చిన్న ఆన్‌లైన్ మోసాలతో ప్రారంభమైన ఇతడి ప్రయాణం.. ఫిషింగ్ స్కామ్‌లు, కాల్ సెంటర్లు, బ్లాక్‌మెయిల్స్, గ్యాంగ్‌స్టర్ పాలిటిక్స్ వరకు వెళ్తుంది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? డిజిటల్ నేరాల నెట్‌వర్క్‌ని శాసించే స్థాయికి అరవింద్ ఎలా ఎదిగాడనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
'చాయ్ షాట్స్' వేదికగా వచ్చిన తెలుగు మైక్రో సిరీస్ ఇది. ఒక్కోటి రెండున్నర నిమిషాలతో 29 ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ తీశారు. యుట్యూబ్‌లో పలు సిరీస్‌లతో ఆకట్టుకున్న దొరసాయి తేజ.. ఇందులో అరవింద్ పాత్రలో అలరించాడు. సక్సెస్ కోసం ఎంతటి అన్యాయానికైనా తెగించే ఒక రా అండ్ రఫ్ నెగిటివ్ హీరోగా బాగా చేశారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి మేకింగ్ కూడా బాగుంది. డైలాగ్స్, నటీనటుల నుంచి నటన రాబట్టడం, రిషి ఎం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అశ్విన్ లెనిన్ విజువల్స్ ఈ సిరీస్ కి ప్రాణం పోశాయి. అరవింద్ పాత్రకు పోటీ ఇచ్చే ఆదిత్య సింగ్ పాత్రలో నితిన్ ప్రసన్న ఆకట్టుకున్నాడు. రెండో సీజన్‌పై ఆసక్తిని పెంచేలా ఆయన పాత్ర సాగుతుంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)