Breaking News

కోలీవుడ్‌పై కన్నేసిన సైతాన్‌ హీరోయిన్‌!

Published on Wed, 08/02/2023 - 09:59

దక్షిణాది చిత్రాల్లో నటించడం తనకు చాలా ఇష్టం అంటోంది ఢిల్లీ హీరోయిన్‌ దేవయాని శర్మ. స్టేజ్‌ ఆర్టిస్ట్‌ అయిన దేవయాని శర్మ శ్రీరామ్‌ భారతీయ కళాక్షేత్ర అకాడమీలో సాంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందింది. అదేవిధంగా నటికి కావలసిన అన్ని విషయాల్లోనూ తర్ఫీదు పొందింది. ఈమె ఇప్పటికే టాలీవుడ్‌లో నటుడు నవీన్‌ చంద్ర కథానాయకుడిగా నటించిన భానుమతి రామకృష్ణ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది.

ఆ తర్వాత సైతాన్‌, సేవ్‌ ది టైగర్స్‌ వంటి వెబ్‌ సిరీస్‌ల్లో ప్రధాన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో యువతను ఆకట్టుకుంటున్న దేవయానిశర్మ ప్రస్తుతం పలు హీరోల సరసన నటిస్తోంది. దక్షిణాది నటిగా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్న ఈమె ఇప్పుడు కోలీవుడ్‌పై కన్నేసింది. కమర్షియల్‌ కథానాయికగా కాకుండా మంచి బలమైన, ఛాలెంజ్‌తో కూడిన పాత్రల్లో నటించాలన్నదే తన కోరిక అంటోంది.

తాను తమిళ చిత్రాలు ఇష్టంగా చూస్తానని, కమర్షియల్‌ అంశాలతోపాటు, కళాత్మక కథా చిత్రాలు ఇక్కడ ఎక్కువగా రూపొందుతాయని పేర్కొంది. తమిళంలో అందరూ హీరోలు నచ్చుతారంది. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. కాగా త్వరలోనే ఓ తమిళ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు దేవయాని శర్మ తెలిపింది. మరి ఇక్కడ ఈ భామ లక్కు ఎలా ఉంటుందో చూడాలి!

చదవండి: సమంత ట్రీట్‌మెంట్‌ కోసం అన్ని కోట్లు ఖర్చు చేసిందా?

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)