Breaking News

ప్రభాస్‌ 'స్పిరిట్‌' సినిమా ఛాన్స్‌ నాకే దక్కింది: మ్యూజిక్‌ డైరెక్టర్‌

Published on Sun, 12/24/2023 - 00:21

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్‌: ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’. సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా, మరో హీరోయిన్‌ మాళవికా నాయర్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ మాట్లాడుతూ– ‘‘డెవిల్‌’ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ఇది పీరియాడికల్‌ ఫిల్మ్‌ కాబట్టి ప్రత్యేక వాయిద్యాలను వాడాం. ‘దూరమే..’ పాటను బుడాపెస్ట్‌లో షూట్‌ చేశాం. అలాగే ‘దిస్‌ ఈజ్‌ లేడీ రోజ్‌..’ పాటను ర్యాపర్‌ రాజకుమారితో పాడించాం. ఈ పాట సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అలాగే నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది.

అయితే సంగీత దర్శకులు, నటీనటులు ఎంత ఎఫర్ట్‌ పెట్టినా విజువల్‌ సపోర్ట్‌ ఉండాలి. ఈ విషయంలో ఈ చిత్రం కెమెరామేన్‌ సౌందర్‌ రాజన్‌గారు ప్రాణం పెట్టి అద్భుతంగా వర్క్‌ చేశారు. సెకండాఫ్‌లోని ఓ ముఖ్యమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లో కల్యాణ్‌రామ్‌ గారి నట విశ్వరూపాన్ని ఆడియన్స్‌ చూస్తారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు రావొచ్చని నాకనిపిస్తోంది’’ అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ– ‘‘భవిష్యత్‌లో డైరెక్షన్‌ చేసే అవకాశం ఉంది. ఇద్దరు గిటారిస్ట్స్‌ మాత్రమే ఉండేలా ఓ సినిమా, డ్రమ్స్‌ శివమణిగారి బయోపిక్‌ తీయాలని ఉంది. ‘యానిమల్‌’ తర్వాత బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్‌తో సందీప్‌ రెడ్డి వంగా గారు చేయనున్న ‘స్పిరిట్‌’ సినిమాకు సంగీతం అందించనున్నాను’’ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)