Breaking News

‘దేవికా అండ్‌ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!

Published on Fri, 06/13/2025 - 09:03

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో  వెబ్‌ సిరీస్‌ ‘దేవికా అండ్‌ డానీ’ ఒకటి. ఈ సిరీస్‌ గురించి తెలుసుకుందాం.

సినిమాలైనా... వెబ్‌ సిరీస్‌లైనా... వాటిలో వచ్చే కథలు కొన్ని వాస్తవ రూపాలైతే మరికొన్ని కథలు దర్శకుని కాల్పనిక కళాకృతులు. రెండిటిలోను ప్రేక్షకుల నమ్మకం అనేది కీలకం. అది వాస్తవమైనా, కల్పన అయినా చూసే ప్రేక్షకుడికి నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. అటువంటి కోవకి చెందినదే ‘దేవికా అండ్‌ డానీ’ వెబ్‌ సిరీస్‌. జియో హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమ్‌ అవుతోంది. దీపక్‌ రాజ్‌ అందించిన ఈ సిరీస్‌ కథకు బి. కిరణ్‌ దర్శకత్వం వహించారు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్‌ థ్రిల్లర్‌ అని చెప్పవచ్చు. సబ్జెక్ట్‌ సీరియస్‌ అయినా చక్కటి హాస్యంతో చాలా జాగ్రత్తగా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు దర్శకుడు. 

‘పెళ్ళి చూపులు’ ఫేం రీతూ వర్మ ఈ సిరీస్‌లో ప్రధాన కథానాయిక. ఓ రకంగా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. దేవిక పాత్రలో రీతూ జీవించారనే చెప్పాలి. ఇక కథ విషయానికొస్తే... దేవిక ఆ ఊరి స్కూల్‌లో సంగీతం నేర్పించే టీచర్‌గా పని చేస్తుంటుంది. దేవిక తాత పెద్ద ఉపాసకుడు. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అద్భుతమైన శక్తి ఉంటుంది. అదే శక్తి మనవరాలు దేవికకు కూడా ఉందన్న విషయం కథ మధ్యలో తెలుస్తుంది. 

దేవికకు ఓ పెళ్ళి సంబంధం ఖాయమవుతుంది. దేవిక స్కూల్‌కి వెళ్ళే సమయంలో ఓ రోజు డానీ అనే వ్యక్తి పరిచయమవుతాడు. డానీని దేవిక ఇష్టపడుతుంది. కానీ దేవిక దగ్గరకు డానీ ఓ సమస్యతో వస్తాడు. ఆ సమస్య వల్ల దేవిక చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుని ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటుంది. పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుండి ఇల్లు, స్కూలుకి పరిధిలోని 20 కిలోమీటర్లలోనే ప్రయాణిస్తున్న ఓ పెళ్ళి నిశ్చయమైన అమ్మాయి దారిలో కనబడ్డ అబ్బాయితో ప్రేమలో పడి ఆ అబ్బాయికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించి తన ప్రాణాలను పణంగా పెడుతుంది. మరి... డానీ సమస్యను దేవిక తీర్చగలిగిందా? తనకు నిశ్చితార్థమైన అబ్బాయినే పెళ్ళి చేసుకుందా? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ‘దేవికా అండ్‌ డానీ’ వెబ్‌ సిరీస్‌ చూసేయండి. సిరీస్‌ మొత్తం మంచి ట్విస్టులతో, చక్కటి హ్యూమర్‌తో ఎక్కడా బోర్‌ కొట్టదు. ఇంకెందుకు ఆలస్యం... చూసేయండి మరి.
– హరికృష్ణ ఇంటూరు 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)