Breaking News

'జెనీలియా' కోసం స్పెషల్‌ సాంగ్‌ పాడిన దేవి శ్రీ ప్రసాద్

Published on Thu, 07/17/2025 - 07:29

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్‌ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న చిత్రం ‘జూనియర్‌’. ఈ నెల 18న విడుదల అవుతున్నా ఈమూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అగ్ర నటీనటులతో దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీ కొర్రపాటి నిర్మాత. శ్రీలీల కథానాయికగా నటించింది.  జెనీలియా, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే, జెనీలియా కోసం సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ ప్రత్యేకమైన పాటతో మెప్పించారు.

ఒకప్పుడు తెలుగు తెరపై యూత్‌ కలలరాణిగా జెనీలియా గుర్తింపు పొందారు. సుమారు 13 ఏళ్ల తర్వాత తెలుగు స్క్రీన్‌పై ఆమె మళ్లీ 'జూనియర్‌' సినిమాతో కనిపించనుంది. దీంతో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ 'బొమ్మరిల్లు' సినిమా నుంచి 'అప్పుడో ఇప్పుడో కలగన్నానే చెలి' సాంగ్‌తో ఆమెను మెప్పించారు. ఈ సాంగ్‌తో పాటు బొమ్మరిల్లు సినిమా కూడా జెనీలియా కెరీర్‌లో చాలా ప్రత్యేకం. అందుకే ఆమె కూడా దేవీ పాటకు బాగా కనెక్ట్‌ అయ్యారు. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

‘బొమ్మరిల్లు’లో జెనీలియా పోషించిన హాసిని పాత్ర అందరికి గుర్తుండిపోయింది. వివాహానంతరం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఆమె దాదాపు 13ఏళ్ల విరామం తర్వాత దక్షిణాదిలో 'జూనియర్‌' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో జెనీలియా కీలక చాలా కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా కథ తనతో పాటు భర్త రితేష్‌దేశ్‌ముఖ్‌కు కూడా బాగా నచ్చడంతోనే నటించానని ఆమె చెప్పారు. బొమ్మరిల్లులో హాసిని, హ్యాపీలో మధుమతి పాత్రలు ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మెమొరబుల్‌గా మిగిలిపోయాయని చెప్పవచ్చు. అందుకే జెనీలీయా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)