Breaking News

సింగర్‌గా పోటీలో దేవయాని కూతురు.. అదిరిపోయే సాంగ్‌తో ఎంట్రీ

Published on Thu, 06/12/2025 - 09:11

నటి దేవయాని (50) చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే వెండితెరపై కనిపిస్తున్నారు. 90లలో కథానాయికగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత. ఆమె రాజకుమారన్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి ఇనియా సింగర్‌గా రాణించేందుకు తొలి అడుగుపడింది. సౌత్‌ ఇండియాలో పాపులర్‌ పాటల పోటీలో ఆమె బరిలో ఉన్నారు. దీంతో తొలిరోజు తన కూతురిని ఆశీర్వదించి ఆ షోలో దేవయాని కూడా కొంత సమయం పాటు పాల్గొన్నారు.

ముంబైకి చెందిన దేవయాని పెళ్లి తర్వాత చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలోని అన్నా సలైలోని చర్చి పార్క్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే, తాజాగా తన కూతురు ఇనియా (21) 'సరిగమప సీనియర్ సీజన్‌-5' రియాలిటీ సింగింగ్ షోలో ఎంట్రీ ఇచ్చింది. జీ తమిళంలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం అక్కడ బాగా పాపులర్‌ అయింది. ప్రతి శనివారం, ఆదివారం సాయింత్రం 7:00 గంటలకు ఈ షో  ప్రసారం అవుతుంది. ఇందులో న్యాయనిర్ణేతలుగా శ్వేత మోహన్‌, టీ రాజేందర్‌, కార్తీక్‌ ఉన్నారు. వేదిక మీద ఇనియా పాడిన పాటకు వారందరూ ఫిదా అయ్యారు. ఆ సమయంలో తన కుమార్తెను చూసుకుని దేవయాని కూడా కాస్త ఎమోషనల్‌ అయ్యారు. వాస్తవంగా ఇనియా వాయిస్‌ చాలా బాగుంది. భవిష్యత్‌లో మంచి సింగర్‌గా ఎదిగే అవకాశాలు మెండుగు ఉన్నాయని కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు.

టాలీవుడ్‌లో సుస్వాగతం సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ,  లవ్‌ స్టోరీ మూవీలో కనిపించారు. ఆమె తెలుగుతో బాటు తమిళ, మలయాళ భాషలలో 75 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. దర్శన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్‌లో ఆమె నటించనున్నారు.
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)