Breaking News

Devatha : తన బిడ్డకు తండ్రి కావాలంటున్న సత్య.. ఆదిత్య ఒప్పుకుంటాడా?

Published on Mon, 05/31/2021 - 14:58

సత్యను ఇంట్లోకి తెచ్చినందుకు రుక్మిణి ఆదిత్యకు ధన్యవాదాలు తెలుపుతుంది. తనను పెళ్లి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తూ సంబరపడిపోతుంది. ఇక సత్య తీరుపై కనకం పరోక్షంగా నిప్పులు కక్కుతుంది. ఆమెను అనరాని మాటలతో చిత్రవద చేస్తుంది. సూటి పోటి మాటలతో సత్యను బాధపెడుతుంది. ఇక సత్య-రుక్మిణిల జీవితాలను తలుచుకొని కమల ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏ క్షణం అయినా నిజం తెలుస్తుందని భయపడిపోతుంది. మరోవైపు తన బిడ్డను అనాథగా ఈ లోకానికి పరిచయం చెయ్యలేనని సత్య ఆదిత్యతో అంటుంది. తన బిడ్డకు తండ్రి కావాలని ఆదిత్యను వేడుకుంటోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ మే30న 247వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

దేవత సీరియల్‌ మే30 : సత్యను ఇంటికి తీసుకొచ్చేందుకు సహకరించిన ఆదిత్యకు రుక్మిణి ధన్యవాదాలు తెలుపుతుంది. తన మనసుకు కష్టం కలుగుతుందని తెలిసి దేవుడమ్మకు ఇష్టం లేకపోయినా సత్యను ఇంటికి రానిచ్చినందుకు థ్యాంక్స్‌ చెబుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అంటూ పొంగిపోతుంది. ఇక సత్యను ఇంట్లోకి తేవడం ఏమాత్రం ఇష్టం లేని కనకం సత్యను పరోక్షంగా ఆడిపోసుకుంటుంది. కొంచెం కూడా సిగ్గూ, మానం, మర్యాద లేని బతుకులు అని నిందలేస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావ్‌ అని దేవుడమ్మ భర్త ప్రశ్నించగా..వేరే బయట అడుక్కునే వాళ్ల గురించి అని బదులిస్తుంది. కానీ అక్కడున్న వారందికి ఆమె సత్యనే అంటుంది అని అర్థమైపోయింది. ఇలాంటి వారు బతకడం కంటే చావడం మేలని సూటిపోటి మాటలతో సత్యను బాధపెడుతుంది.

ఇక సీన్‌ కట్‌ చేస్తే సత్య-రుక్మిణిల జీవితాలను తలుచుకొని కమల నిస్సహాయ స్థితిలో కుమిలిపోతుంది. నిజం చెబితే రుక్మిణి, చెప్పకపోతే సత్య జీవితాలు నాశనం అవుతున్నాయంటూ బాధపడుతుంటుంది. ఇక మరోవైపు కనకం అన్న మాటలను తలచుకొని సత్య  బాధపడుతుంది. ఈలోగా అక్కడికి ఆదిత్య చేరుకుంటాడు. కనకం అన్న మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని అంటాడు. అయితే తాను బాధపడుతుంది కనకం అన్నందుకు కాదని, తన బిడ్డకు తండ్రి లేని వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం చెయ్యలేనని సత్య అంటుంది. తన బిడ్డకు తండ్రి కావాలని ఆదిత్యను వేడుకుంటోంది. తన బిడ్డను అనాథగా ఈ లోకానికి చూపించలేనని చెప్తుంది. మరి సత్య మనసులో ఏముందో ఆదిత్య తెలుసుకుంటాడా? సత్య బిడ్డకు తండ్రి స్థానాన్ని ఆదిత్య తీసుకోగలడా అనేది తర్వాతి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)